పుట:Kasiyatracharitr020670mbp.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు


History of the Presidency College Mfedra-s (Centenary) 1940- The Madras Tercentenary Commemoration Volume The History of Madras- Prof . C. S. Srinivasachari H, D. Love Vestiges of Old Madras Life of Gazida, Lakshminarsu Chetty Garu, . Representative -men of Southern India-by G, Parameswaram Pillai (1896) The Journal of Vennelacunty Soobrow, Native of Ongole Foster Press, Madras. 1873

శ్రీ ఒంగోలు వెంకటరంగయ్యపంతులుగారు వ్రాసిన 'నెల్లూరులోని కొందఱు గొప్పవారూ---వెన్నెలకంటి సుబ్బారావుపంతులుగారు. అనేచిన్నపుస్తకం.

1941 సం|| మార్చి 1 వతేదీ మొదలు కృష్ణాపత్రికలో 11 సంచికలలో ప్రకటింపబడిన "ఇంగ్లీషుచదువులు" అనే శెర్షికతో నేను వ్రాసిన వ్యాసాలు. ఆంధ్రపత్రిక వృషసంవత్సరాది సంచికలో 'చెన్నపట్టణము దాని పూర్వచరిత్ర ' అనే శీర్షికతో నేను వ్రాసినపెద్దవ్యాసం.

ఆంధ్ర వార పత్రికలో 1941 స|| మార్చి 26 వతేదీ మొదలు 5 సంచికలలో నేను వ్రాసిన "బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర" అనే వ్యాసాలు.

ఆంద్రపత్రికలోనే 1941 సం|| ఫివ్రవరి 5 వ తేదీన కాశీయాత్ర చరిత్రను గురించిన్నీ జూలై 30 వ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిన వ్యాసాలు.

సి.పీ. బ్రౌన్ దొరగారికి వీరాస్వామయ్యగారు వ్రాసిన లేఖ

[వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న-అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యుస్చ్రిప్ ట్సు లైబ్రరరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించియున్నది. దానకిది తెనుగు. ఉత్తరంపైన బ్రౌనుగారి స్వదస్తూరీతో రెమార్కు వున్నది. ఉత్తరంపైన "సీ.పీ.బ్రౌన్ ఎస్కైర్, మచిలీపట్టణము" అని పై విలాసమున్నది]

నాప్రియమైన అయ్యా మద్ర్రాసు

                                  1831 వ సం|| 15వ తేది  

నేను నాకుటుంబంతో కిందటి సెప్టెంబరు నెలలో సుఖంగా చెన్నపట్టణచేరి సుప్ర్రీము కోర్టులో నా (ఇంటర్ ప్రిటర్) నే చూపడం ప్రారంభించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయలసిన పని చాలా పెరిగిపోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకు పూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను.