పుట:Kasiyatracharitr020670mbp.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు.

రచయిత : దిగవల్లి వేంకట శివరావు.

ఏనుగుల వీరాస్వామయ్యగారు పంతొమ్మిదో శతాబ్ద ప్రారంభంలో క్రీ.శ.1780-1836 మధ్య చెన్నపట్నంలోవుండి, ప్రజాసేవచేసిన ఆంధ్రమహా ..... ప్ర వీరుచెన్నపట్టాణంకాపురస్తులు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులు. వీరి తండ్రి సామయమంత్రి. ఫీరిది శ్రీవత్సగోత్రము. 1815 మొదలుకుని 1829 వరకూ పట్టణంలో సదర్ అదాలతు కోర్టులో ఇంటర్ ప్రిటరుగా వుండిన ఒంగోలుజిల్లా కాపురస్థుడైన శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారికిన్ని, రాజానగరం, అచవెలవగైరా గ్రామముల జమీందారులున్ను రాజమహేంద్రవరం కాపురస్థుడు అయిన శ్రీ కొచ్చెర్లకోట వెంకటరాయనింగారికిన్నీ వీరు బంధువులు. వీరేసంవత్సరంలో జన్మించారో తెలియలేదు. అయితే 1835లో తనువు చాలించుకునేటప్పటికి 55 సంవత్సరాలున్నాయనుకుంటే, వీరు 1780 లో పుట్టి యుంటారు.

వీరాస్వామయ్యగారికి తొమ్మిదవయేటనేతండ్రి చనిపోయినాడు. తేడాఎక్కువగా లేదు. ఈయన కష్టపడి వీధిబడిలో తెనుగు, అరవము, సంసృతము చదువుకొని స్వయంకృషివల్ల ఇంగ్లీషునేర్చుకొని, తన వన్నెండవ యేటనే ఈస్టు ఇండియా వర్తశకంపెనీవారి కొలువులోవాలంటీరుగా ప్రవేశించి, కొన్నిచిన్నవుద్యోగాలుచేసి మద్రాసులో నేటి హైకోర్ఘుకు పూర్వం వుండిన సుప్రీము కోర్టుకు తెలుగు అరవము ఇంగ్లీషు భాషలలో తర్జుమాచేసే ఇంటర్ ప్రిటర్ ఉద్యోగంలో 1819 లో ప్రవేశించి, హెడ్ యింటర్ ప్రిటర్ పదవిని పొందారు. ఆ కాలంలో అది పెద్ద ఉద్యోగం. ఆ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తులుగా వుండిన అందరి మన్ననలకూ వీరు పాత్రులై 1835 లో కొలువు చాలించుకున్నారు. 1836 వ సంవత్సరం అక్టోబరు 3 వ తేదీన స్వర్దస్థులైనారు.

వీరాస్వామయ్యగారికి యింగ్లీషు తెలుగు అరవలందున్నూసంసృతంలో మంచి పాండిత్యం వుండేది. వీరికి శ్రుతిస్ముతులు, శాస్త్రాలు, బాగా తెలుసును అనేక పండితసభలందు పాల్గొన్నారు. 1822-23 మధ్య క్షయమాస నిర్ణయించడానికి జరిగిన సభలో వాదించి గెలిచారు. గయలోజరిగిన పండితసభలో స్మృతులేవో ఉపస్మృతులేవో ఆదిపురాణాలేవొ నిర్ణ యించారు. స్మృతి చందస్సు తర్జుమాచేశారు. వీరాస్యామయ్యగారు దొరలతో రాజకీయ సాంఘిక మతవిషయాలు నిర్బయంగా చర్చించేవారు. వీరి అభిప్రాయాలు విమర్శలు కొన్ని వీరు రచించిన కాశీయాత్రలో వున్నాయి.

సీ. పె. బ్రౌనుదొరగారు వీరికి స్నేహిగులు. ఈ బ్రొవ్నుదొరగారు 1855 మధ్య్స ప్రకటించిన తెలుగు నిఘంటువులో ఇంద్రాణి, శేదా; పాలకట్టు; సంవర అను పదాల అర్ధాలకు వీరాస్యామయ్యగారిని ప్రమాణంగా పేర్కొన్నారు.