పుట:Kasiyatracharitr020670mbp.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కష్టపడి నడిచేపాటిగా ఆకొండలమధ్యే ఒక చిన్నదారి వుండినది. యీ రాజ్యములో యింగిలీషువారి అధికార మయిన వెనక యీ కొండను కొట్టి దారియేర్పరచి యేడుతిరుగుళ్ళుగా దిగడానికి యెక్కడానికిన్ని దారియేర్పరచి యేడుగుళ్ళుగా దిగడానికి యెక్క దానికిన్ని బండ్లకు కూడా ప్రయాసలేకుండా వుండేటట్టు చేసి నారు. యీదినము నడిచినదారి రాతిగొట్టు వొకటే ప్రయాస గాని కడమ అన్ని విధాల అనుకూలముగా నున్నది. నేడు నడిచిన 7 కోసులమధ్యె ఉదక వసతి యే మాత్రమున్నులేదు. తపాలు మనుష్యులుకూడా వేసంగి కాలములో ఉదకము కూడా తీసుకొని వస్తూ పోతూవుంటారు. కొందరు ముసాఫరులు వేసంగి కాలములో దారిలో ఉదకము దొరక నందున దాహమును వొర్చుకొనలేక ప్రాణములు వదిలి నారట. గనుక యీ యేడు కోసులున్ను చల్లనివేళ నడవ వలెను. యీవూరు కొత్తగా బస్తీ అయినది. అంగళ్ళు మొదలయినవి వసతిగా కట్టివున్నవి. దగ్గిర ఒక నదివున్నది; బావులుకలవు. పశువులు మొదలయినవి నిలాడానికి వూరిముందర ఒక మర్రి చెట్టు తప్ప వేరే ఆసరాలేదు. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యిక్కడ మరునాడు మధ్యాహ్న పర్యంతము నిలిచినాను.

28 తేది మధ్యాహ్నము మీద రెండు ఘంటలకు యీవూరు వదిలి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే బాలుగంజు అనేవూరు రాత్రి 7 ఘంటలకు చేరినాను. దారిలో మూడునదులు దాటవలెను. వాటికి వారధులు కట్టడానికి కుంఫిణీవారు యత్నపడు చునున్నారు. సడక్కువేసి యున్నదని పేరేగాని నడిచేవారికి అనుకూలముగా ఘట్టన చేసి యుండలేదు. దారి మయిదానము మధ్యే పోవుచున్నది. దారిలో బరోడా అనెవూరున్ను మరికొన్నిచిన్నవూళ్ళున్ను వున్నవి. యీ లాలుగంజిలో డాకా అనే దొంగసమూహల భయముచేత కుంఫిణీవారు ముసాఫరులను దుకాణాలలో, ఇతరస్థళాలలోనున్ను రాత్రి దిగకుండా చేసి సరాయి అనే ఒక పెద్దచాడి నాల్గు పక్కలా ప్రహరీగోడ పెట్టి ఆగోడ ఆసరాచేసి చుట్టూ కొట్టాయి వేసి ఆ కొట్టాయిని అర లరలుగా వుంచి రెండు దరవాజాలు పెట్టి, కావలికి 25 ఠాణాజవానులను వుంచినారు. రాత్రి 10 ఘంటలకు ఈ సరాయి తలుపులు బిగించి, బీగాలు