పుట:Kasiyatracharitr020670mbp.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

15 మందికి జ్వరాలు తగిలి ప్రతిదినమున్ను మజిలీ చెసిన వనక ఆసుపత్రిలో డాక్టరులు వరుసగా చికిత్స చేస్తూవచ్చేటట్టు నాడేరాలవద్ద వీరి కందరికిని చికిత్స జరుగు వచ్చినది. యిదివరకు శ్రీరామకటాక్షముచేత అందరికి అనుకూలముగానే ఉన్నది. యీ వూరిలో యీ రాత్రి పగలున్నూ వసించడమయినది.

యింతకుముందు నేను మజిలీ చేసిన సత్తిని అనేగ్రామమువద్ద నుంచి ప్రయాగకు సూతియయినదిగా నాల్గుమజిలీలతో చేరతగ్గదిగా ఒక దారి వున్నది. ఆ దారి అడ్సున్ను కొండ యెక్కుడు దిగుడు ప్రయాసయున్ను కలది. చెన్నపట్టణము వదిలి పెదపాళెమురాగానే ఒక గయావళీ కలుసుకొనెను. వానిని విదిలించుకోను బహుకష్టమైనది. అలాగే ఒక గయావళి తిరువళ్ళూరిలో కలిసి వదిలినాడు. కడపలో ఒక గయావళి తగిలి హయిదరాబాదు దాకా చెంగి చెంగి కూడావచ్చి వదిలి పోయినాడు. నాగపూరులో కొందరు తగిలి చేరనేరక వదిలినారు. రామటెంకిలో ఒక గంగాపుత్రుడు జబ్బల్ పూరులో యిద్దరు ప్రయాగ వాళీలును యిద్దరు కాశీ రాణీ తెనుగు బ్ర్రాంహ్మణులున్నూ తగిలి నా వద్ద చేరడము ప్రయాస అయినా మజిలీ మరు మజిలీగా నాతోకూడా వస్తున్నారు. యీరాత్రి పగలున్ను ఈ వూరిలో వసించినాను.

27 తేది 8 ఘంటలవరకు పయిమజిలీ వూరిలోనే వుండి ఆవూళ్ళో యింటింట చలిజ్వరాలతో మనుష్యులు బాధపడుతారని తెలిసినందున యెండను లక్ష్యపెట్టకుండా బయలుదేరి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కట్రా అనిన్ని ద్రమ్మర్ గంజు అనిన్ని ద్వినామమయిన వూరు 1 ఘంటకు చేరినాను. హనుమాన్యా విడిచి నది మొదలుగా కట్రా అనేవూరు చేరేవరకు కొండ కొంచెముగా యెక్కి నిండా దిగుతూ రావలసినది. యీ దినము దారి యావత్తు కొందమీద అడివిమధ్యే నడుస్తూ రావలసినది. మృగభయము విస్తారము గనుక కూడావున్న తుపాకీలను నా జవానులు కాలుస్తూ వచ్చినారు. ఆధ్వనికి వృక్షాలుకూడా అదురునుగనుక మృగభయము మాకు యేమాత్రమున్ను లేక వుండినది. పూర్వకాలమందు ఈహనుమాన్యూవూరినుంచి కట్రా అనే వూరికి రావడానికి మనుష్యులు