పుట:Kasiyatracharitr020670mbp.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

లోపల వున్నాడు. ఉత్తరువు లేకనే ముసాఫరులను కూడా లోపల పోనివ్వరు. వూరి చుట్టూ మంచి చెరువులున్ను గుంటలున్ను ఉన్నవి. అందులో దామరవేసి యున్నది. ఊరివద్ద పర్వతాగ్రమందు ఈ రాజు తన యిష్టదేవత యయిన శక్తికి గుడి కట్టించి యున్నాడు. ముసాఫరులకు గాను సదరహిబంగళాదగ్గిర ఒక చెరువు కట్టమీద సరాయి అనే ఒక పెద్ద కొట్టాము కట్టించి యున్నాడు. అందులో నొక అంగడి యున్నది. అందులోనే ముసాఫరులు దిగవలసినది. మరియొక గుంట గట్టున ఒక పెద్ద శివాలయ మున్నది. అందులో ఒక మధ్యరంగ మున్ను చుట్టూ తాళ్వారము (మండువా వసారా)న్నూ నయిన అంతస్థులతొ రెండుస్తూపీలున్ను అందులో రెండు అరలున్ను నాల్గు దిక్కులలో నాల్గు జపమంటపాలున్ను కట్టి యున్నవి.

నేను కన్యాకుమారి మొదలుగా ఇదివరకు దేశసంచారము చేసి నంతలో దాక్షినాత్యులకున్ను ఉత్తర దేశాస్థులకున్ను ఆహారాదులున్ను ధైర్యస్థైర్యములున్ను బింబారాధనలున్ను వీరందరున్ను శ్రుతిస్కృతి పురాణములను అనుసరించిన వారైనా, భేదించి యుండుటకు కారణమేమని యూహించగా నా బుద్దికి తోచినది యేమంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు చందముగా పరబ్రహ్మ యాజ్ఞచేత రజ్జువుచేత విడబడ్డ బొంగరమువలెనే కొన్ని బ్రంహ్మాండాలకు జ్యోతిర్బూతముగా యేర్పరచబడి యుండేసూర్యునికి ఒక ప్రదక్షిణము 36.4 దినములు చిల్లర గడియలకు చేసేది గనుక ఆ సూర్యునికి ఈబ్రంహ్మాండములో అభిముఖ ప్రదేశముగా వుండేదాన్ని మనవారు నిరక్షదేశమని చెప్పుతారు. యింగిలీషువారు దానినే లయను అని చెప్పుతారు. అక్కడ మధ్యాహ్న కాలానికి ఆయా వస్తువులమీద వాటి గాత్రము లో లయింపుచున్నది గనుక ఆప్రదేశము మిక్కిలి ఉష్ణకరమైనది. ఆ ప్రదేశము మొదలు ఉత్తరధృవుని పర్యంతము 90 భాగలుగా యీ గణితజ్ఞులు భాగించి యున్నారు. ఆవుత్తర ధ్రువుణ్ని యింగిలీషువారు నార్త్ పోల్ అను చున్నారు. ఆ నిరక్షదేశంకు మొదలు భాగకు భాగకున్ను ఉష్ణము తగ్గుచు వచ్చుట వలన అక్కడికి నిండా దూరపు ప్రదేశము శీతము