పుట:Kasiyatracharitr020670mbp.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మనుష్యులు సకల స్వరూపాఅలున్ను ఏర్పరచడానకు ఈశ్వరుడు ఒక మాదిరిని సృష్టించుచు వచ్చుట సిద్ధము గనుక కోట బురుజులను మనుష్యులు కట్టను ఈ కొండను సృష్టించి చూపించినట్టు తొచుచున్నది. భాట కిరుపక్కల పొడిచెట్లుగాని అడివిలేదు. దారిలో విస్తరించి వరిపయిరు వేసియున్నది. పచ్చికె దట్టముగా కోమలముగా పొడుగుగానున్ను పెరిగేభూమి సారవత్తమయినది గనుక నిర్మల మొదలు శింధిఅనే వూరిదాకా భూమి పచ్చికబాగా పట్టివున్నందున నున్ను మృదువయిన తియ్యని నల్ల రేగఘమట్టి గలిగి యున్నందుననున్ను అంతమేరయున్ను సారవత్తయినదని చెప్పవలెను. పయిగా ఆ భూమి చెట్లబలం ఇతరభూమి చెట్లకులేదు. అయితే వానకాలమున అక్కడ వసించేవారికి కాలు దిగబడుచున్నది గనుక ప్రయాస విస్తారము. ఒక విధమయిన సౌఖ్యము ఈశ్వరుని కృపవల్లకలిగితే ఒక విధమయిన కష్టమున్ను కలిగి యుంచున్నది.

సభాగంజు అనే గ్రామము మజిలీస్థలము. దిగను అంగళ్ళు వసితిగా వుండవు. అన్నిపదార్ధాలున్ను దొరుకుచున్నవి. గుణవారా అనేవూరిలో అంగళ్ళు దిగను మంచి వసతిగా నున్నవి. చెక్కాఅనే వూరు మొదలుగా మయిహరు రాజు రాజ్యము. అతనికింది అధికారస్థులు గొప్ప ముసాఫరుల సరఫరాయి నిమిత్తమై కొత్తవాలు మొదలయిన మనుష్యులను వుంచియున్నారు. ఈ గుణవారాలో ఆరాత్రి వచించినాను.

17 తేదీ ప్రొద్దున 6 ఘంటలకు లేచి 10 ఘంటలకు 4 కోసుల దూరమందుండే మైహరు అనే రాజధాని చేరినాను. మధ్యనున్న యూళ్ళు. నెంబరు 13; గురయ్యా 1. మైహరు - 1.

యీ మైహరు యధోచితముగా బస్తీ అయినది. దారి నిన్నటి దారివలె సడక్కు వెసి యున్నది. వానవల్ల అక్కడక్కడ దారి చెడిఉన్నందున మనుష్యులు మరామత్తు చేయుచున్నారు. నిన్నటివలె కొండల నడుమ దారి పోవుచున్నది. అడివిలేదు. ఈమైహారులో జబ్బల్ పూరు యిలాకా రహదరుల విచారింఛే దొర ఒక బంగాళాకట్టి తన ఠాణాను ఒక డభేదారునితో కూడా వుంచి యున్నాడు. రాజు కోట,