పుట:Kasiyatracharitr020670mbp.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్య గారి

శీతతరము అతిశీతతరము న్నవుచు వచ్చింది. ఆ ప్రకారము భూమిని భాగించి నంతలో కన్యాకుమారి తొంమ్మిదో భాగలోవున్నది. చేన్నపట్టణము 14 భాగములోనున్ను హయిదరాబాదు 18 భాగలలోనున్ను నాగపూరు 22 భాగలోనున్ను అగరా(ఆగ్రా) 26 భాగలోనున్ను డిల్లె 29 భాగలోనున్ను వున్నవి. గనుక కన్యాకుమారి మొదలు సుమారు 15 భాగలోనుండే నెల్లూరి వరకు భూమి ఉష్ణకరమయిన వెన్న యెట్లా ఉష్ణానికి క్రమక్రమముగా పలచన అవుచున్నదో తద్వత్తుగా ఆయుష్ణ భూమిలో వసించే వారి హృత్కమలము మృదుభావమును పొందే కొద్దిన్ని వారియొక్క ధైర్య స్థైర్యాలు జాఠరాగ్ని, బలహాని ద్వారా తక్కువ అయివుంటున్నది. 'ఉష్ణముష్ణేన శీతలా అనే న్యాయప్రకారము జాఠరాగ్నికి ఉష్ణభూమిలో దీపనశక్తి మట్టుబడ వలసినది సహజమేగదా? జాఠరాగ్ని మందగతిని పొందియుండుట చేత కన్యాకుమారి మొదలుగా నెల్లూరి వరకు వసింఛేవారు త్వరగా జీర్ణదశను పొందతగిన తేలికె ఆహారాలైన తమిదెల పుల్లటి యంబలి సద్దిఅన్నము కూటినీళ్ళు గంజి, మజ్జిగతేట, మిరియాల చారు మొదలయిన బక్ష్యములను పుచ్చుకొనుచు వస్తారు. యీభక్ష్యములు బలకరములు గానందున హృత్కమలాన్ని దృఢతరము చేయనేరక యున్నవి. హృత్కమలము దృఢకరము కానందున బిడ్డపాపలను విడచి ఎట్లా దూరసంచారము పోయ్యేది? పోతె మనగతి అక్కడ యేమవునో; యిక్కడ వీరిగతి యేమవునో అని భయపడి దేశ సంచారమును దాక్షిణాత్యులు బహుశ: మానుకొను చున్నారు; ఇంతేకాకుండా యెప్పుడు ధయిర్యము కొంచమవుచున్నదో అప్పుడు చంచల్యము జనింపుచున్నది గనుక చాంచల్యము ద్వారా వస్తు విషయములుగా నున్ను స్త్రీ బోగాలు మొదలయిన వాటి విషయముగానున్ను నిండా భోగింఛే శక్తిలేక పోయినా అలాటి విషయములను భోగించవలె నని తత్సంబంధమయిన అఫెక్ష యెక్కువ అవుచు వచ్చుచున్నది. అటివంటి వారున్ను ఒక పద్దతిని పొంద వలసినది. యీశ్వరునికి అగత్యము గనుక అతడు తన చైతన్యము యెక్కువగా ప్రతిఫలించిన అప్పయదీక్షితులు రామా