పుట:Kasiyatracharitr020670mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీ నాగపూరి రాజు మరాటీజాతి తంజావూరి రాజు బంధువు. ఆ రాజువంశస్థులు శ్రేయస్కాములయి యుండగా దేవ బ్రాంహ్మాణ పూజ చాలాగా చేయుచు వచ్చినారు. ఈ సరికి కుంఫిణీ వారి కలకటరులు నియమించిన తహశ్శీలుదారులు వగైరాలగుండా రాజ్యతంత్రము గడుచుచున్నది. రాజ్యములో నుండేవారు రాజులకు రాజ్య మివ్వడవల్ల ఏమాత్రమున్ను సంతుష్టిని పొందియుండలేదు. ఈ రాజుకు సాలుకు ఇంతమాత్రమని రూకలు కట్టే జమీందారులు కొందరు ప్రబలులుగా నున్నారు. శీతాబులిడి యనే కొండవద్ద ఇదివరకు రాజుకున్ను, ఇంగిలీషువారికిన్నీ కొన్ని యుద్ధములు జరిగినవి. చుట్టూ కొన్ని జాతుల వారి యిండ్లున్ను, ఆర్సనలు అనే ఆయుధశాల, పోస్టాఫీసు మొదలయినవి కట్టియున్నవి. పాషింజాతివారు బొంబాయినుంచి సీమ వస్తువులు తెచ్చి యింగిలీషు లాయఖు అయిన షాపులు ఉంచుకొనియున్నారు. ఇక్కడ నొక బజారు, కొన్ని హిందువుల యిండ్లు కలిగియున్నవి. యిక్కడ విడవలిపూరి అల్లే నాజూకు బహువింతగా, అతి సుందరముగా నున్నది.

యీ నాగపూరికి 3 కోసుల దూరములో కామిటి అనే పేరుకలిగిన ప్రదేశములో యింగిలీషువారు అయిదు బటాలాలబారునున్ను అందుకు తగిన యధికారస్థులనున్ను, ఉద్యోగస్థులనున్నుంచి యున్నారు. యీ కామిటి పెద్ద బస్తీ గ్రామము. దండులో లెక్కలు వగైరాలంతా యిగిలీషు భాషతో వ్రాయవలసి యున్నది. గనుక మధ్యదేశస్థులు బహుమంది అరికాటు మొదలారులు మొదలయినవారు చేరయున్నారు. వారు స్వదేశస్థులు వచ్చినంతలో ప్రీతి చేయడము మాత్రమే కాకుండా యీ దేశస్థులకంటె ఎక్కూవగా తాము పరస్పరా భిమానము కలిగి ఒక పొట్లముగా మిత్రభావమును పొందియున్నారు. యిదివరకు జాతుల వారు యీదేశములో ప్రవర్తించుటలో స్వజాతి వైరము లేక ఒకరికొకరు ఉపకారము చేయ నిచ్చ కలిగి యుండడము వీరి దేశ సంప్రదాయము కాబోలనుకొంటిని. యిప్పట్లో యీ కామిటిదండు ప్రవే