పుట:Kasiyatracharitr020670mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శించిన వెనక సహజముగా పరదేశానికి మరియొక దేశస్థులు కొందరు పోయిన ట్టయితే కానని యిష్ట పదార్ధాము అపూర్వముగా కనుటచేత నొక విశ్వాసము అందరికిన్ని జనియింపుచున్న దని నిశ్చయించినాను.

యిప్పట్లో హిందువులుచేసే యుద్యోగాలలో హయిదరాబాదు, నాగపూరు, జాలనా, మహినూరనే ఈ నాలుగు స్థలముల కమ్మిస్సేరైయాటు ఉద్యోగాలు ఉత్తమములుగా దోచుచున్నవి. కమ్మిస్సేరైకి వచ్చే దొరలు కత్తికట్లున్ను అట్లాగే బంగాళిదండున్ను బహుదినములు ఇక్కడ వసించి బ్యారుకునులు, వారధులు మొదలయిన పబ్లికు బులుడింగును అనే గృహశాలలు శానా కట్టించినారు. ఇటువంటి పనులకు చెన్నపట్టణపు గవునరుమెంటువారి శాంకిస ననే అనుజ్ఞ దుర్లభము గాని, బంగాళా గౌనరుమొంటు వారు ధారాళముగా అనుమోదింపుచున్నారు.

యీ శీతాబులిడి మొదలు కామిటిదండు దాకా గుర్రపుబండ్లు పోయి వచ్చేటందుకు యోగ్యముగా శాలవేసి నడమనుండే వాగులకు వారధులు కట్టియున్నవి. అయితే దారి యడారిగా నున్నది. నాగపూరు షహరులో సుమారు యిరువైవేల యిండ్లు ఉండవచ్చును. బహు చిన్నయిండ్లు. చూపుకు లక్ష్మీకరములుగా, వాసయోగ్యములుగా నుండలేదు. బాజారులు శానావున్నవి. సకల భోజన పదార్ధాలున్ను, ఆ దేశపు ఫస్త్రాలున్ను సమృద్దిగా దొరుకును. పనుల విశేషాలు తెలిసిన వారి విస్తరించి లేరు. నివసస్థులు కృత్రిములుగాని, హయిదరాబాదు షహరు వారివలెనే మాటకు మునుపు ఆయుధమును వాడేవారు కారు. స్త్రీలు పురుషులున్ను బలిస్టులుగానున్ను, రూపవంతులుగా నున్నున్నారు. సకల ఫలజాతులు దొరుకును. కమలాపండు కాలమందు బహు మంచివిగా, విస్తారముగాఇక్కడ ఫలింపుచున్నవి. సీమ అత్తి పండ్లు, సీమ పన్నీరు పూలున్ను, అమితముగా ఫలింఉచున్నవి. సారవంత మయినభూమి. అనేక తోటలు షహరుచుట్టు ఉన్నవి. అరటిచెట్లు సమృద్ధిగా వేస్తారు. వీధులు కుసంది. ఇప్పట్లో కొత్తవాల్ చేసే తురక షహరులో నడివీధిలోవేసిన వస్తువు వేసినవాడువచ్చి వెతికి యెత్తుకొనేదాకా పడి యుండేటట్లు ఆజ్ఞ చేయుచున్నాడు. సందుకు ఒక ఠాణా ఉంచియున్నది. ఈ రాజుకు ఈ