పుట:Kasiyatracharitr020670mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11 తేది ఉదయాన 6 ఘంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములోనుండే మాండగాం అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను. దారిలో హింగన్ ఘాటు అనే షహరువంటి యూరివద్ద వన్నేనే నది సదరహివ్రాసిన దోనెకుండా దాటవలసినది. హింగన్ ఘాటు అనే షహరు స్థలము నిన్నటి మజిలీకి 4 కోసుల. యీ యూరిలో చుట్టుపక్కలా బహు దూరానికి అందేటట్టుగా వుప్పు తెచ్చియుంచి వర్తకులు రాసులమోడిగా అమ్ముచున్నారు. సాహుకారు కొఠీ లున్నవి. నాణ్యములు ఇక్కడ మార్చుకొన వచ్చును. బట్టలు వగయిరాలు, సకల పదార్దాలు, ఔషద దినుసులు సమేతముగా యిక్కడ కావలసినంత దొరుకును. నేటి దారి చికిని అనే యూరు మొదలుగా నాగిరి పర్యంతము ఉన్నట్టే యధోచితముగా అనుకూలముగా నున్నది. వాగులు విస్తారము దాటవలెను. మాడుగాం అనే యూరు యధోచితముగా బస్తీ అయినదే. ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. స్థల సంకుచితము లయిన యిండ్లు కలవు. బ్ర్రాంహ్మణయిండ్లున్నవి. నిన్నటి దేవాలమువంటి దేవాలయము ఒకటి యున్నది. యీ దినము గోకులాష్టమి గనుక ఆగుళ్ళో ఉత్సవము జరుగుటచేత నొక సంకుచిత మైన మారువాడివాని అంగట్లో దిగి ఈరాత్రి దిగి ఇక్కడ వసించినాను.

12 తేది 6 1/2 ఘంటలకు బయలువెళ్ళీ 5 కోసుల దూరములో నుండే చింది అనే గ్రామము 10 ఘంటలకు చేరినాను. దారినిన్నటి వలెనే యున్నది. అనేకములయిన పల్లాలు దిగి మిట్ట లెక్కవలసి వాగులు దాటవలసి యున్నవి. చింది యనేది కసుబా గ్రామము. పేట స్థలము. అన్ని పదార్దాలు దొరుకును. భ్ర్రాంహ్మణయిండ్లు, చావిళ్ళున్ను కలవు. నేను కఛ్ఛేరి చావడిలో దిగినాను. ఈ ప్ర్రాంతముల బస్తీ మజిలీ వూళ్ళలో వారానకు నొక దినము సంత. ఆ సంతకు అన్ని పదార్ధాలు ఇతర గ్రామాలనుంచి తెత్తురు. అదే ప్రకారము ఈదినమున ఈ యూరికిన్ని తెచ్చినారు. అప్పట్లో అన్ని వస్తువులు సయముగా బాహటముగానున్ను దొరుకుచున్నవి. కూరగాయలు,