పుట:Kasiyatracharitr020670mbp.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్ధాలు దొరుకును. బ్రాంహ్మణ యిండ్లు యిరవైదాకా కలవు. ఫేష్కారు యొక్క యింటిలో దిగి యీ రాత్రి ఇక్కడ నున్నాను.

1 తేదీ ఉదయమున 3 ఘంటలకు బయలు వెళ్ళి 5 కోసులదూరములో నుండే వోణీ అనే యూరు 11 ఘంటలకు చేరినాను. దారిలో చిన్నయూళ్ళు నాల్గున్నవి. నడిచినంత దూరము నల్ల రేగడ, అడుగున రాతిపరి; పయిన అడుసు. చిన్న వాగులు కొన్ని దాటవలసినది. అడివి; రాతిగొట్టు, వేమనో అనే గ్రామము బహు బస్తీ అయినది. దేవాలయాలు కలవు. సకల పదార్ధాలు దొరుకును. అధికారస్థులుండే కసుబాస్థలము, జలవసతి కలదు. ఇండ్లుగొప్పవి. నేను గొప్ప వేంకటేశ్వరదేవాలయములో దిగినాను. సవారీల నుంచడానికి, బోయీలు జవానులు కావటివాండ్లు వగయిరా లుండడానికిన్నీ, చావిళ్ళూ మణిగ లడే జామీనులు, మశీదులు అసర్ ఖానాలు శానా వున్నవి. దినుసువల్లు నాణ్యములు ఇక్కడ మార్చుకోవలసినది. ఈ యూరంతా యిసుక పర గాని, అడుసుకాదు. ఆ యూరు నదీతీరము. నిజాము వద్ద కలటరు హొదా చేసినవారు కొంద్రు జాతులవాండ్లు యిక్కడ యిండ్లు కట్టుకొని యున్నారు. ఇంగిలీషువారు కలకటరులు కావడానికి హేతువేమంటే నిజాము తరపున నున్న అధికారస్థులు జమీందారులు నసిగా రూకలు పంపించనందున యింగిలీషు దొరలు తాలూకాలమీద నుండే దాపుమీద రూకలు వచ్చునని దివాంజీ చేసే చందులాలా యోచించి రిసైడెంటుతో మాట్లాడి తాలూకాల మీదికి తన యములు దారులతొ కూడావుండి వ్యవహారము చూడ గలందులకు యింగిలీషు దొరలను పంపించినాడు. వారు అక్కడక్కడ నిజాం అధికారస్థులతొ కూడా వుండే వ్యవహారము జరిగించినారు. అందువల్ల మొగలాయి ధోరణి జులుము లోకుల మీద నిండా వ్యవహారస్థులు చేయకుండా వచ్చినది గనుక అధికారస్థులకు వైపు (ఉపాయము) తోచక, చందూలాలాకు తెలియచేసి నంతట్లో మళ్ళీ ఆ కలకటరులను రిసైడెంటు పిలుపించుకొన్నాడు. యిప్పటికీ యింగిలీషువారి న్యాయ