పుట:Kasiyatracharitr020670mbp.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


4 కోసుల దూరములో ఈ వూరున్నందున నెను దిగలేదు. ఇదిగాక చిన్నవూళ్ళు కొన్ని వున్నవి. మజిలీ చేయడానికి తలుచుకొనతగినవి కావు. ధనొరా వూరిముందర పిన్నగంగ అనే నది దాటవలసినది. ఇక్కడ కొయ్య తొలిచిన రెండేసి చిన్న దోనెలు జోడించి కట్టినదోనె రెండేసి సవారీలున్ను ఆరుబోయీలున్ను ఒక తేవకు దాటింపు చున్నది. సామానులున్న పరివారమున్ను దాటడానికి రూ.2 దోనెవాండ్లకు ఈనాముగా నిచ్చినాను. కొంఫిణీవారి తఫాల్ దాటించడానికి సంవత్సరానికి 1 కి 3 రూపాయీలు లెక్క జీతముగా 12 రూపాయిలు గోదావరి మొదలయిన నదులు దాటించేవారికి యిచ్చేటట్టు వర్షాకాలము నాల్గు నెలలకు నెల 1 కి 3 మూడురూపాయీలు లెక్క జీతముగా నిచ్చుచున్నారు. లోకులవద్ద మనిషికిన్ని పశువుకు న్నింత మాత్రమని పుచ్చుకొని యీ దోనె వాండ్లు తమ వచ్చుఒడిలో నొక హిస్సా నిజాము సర్కారుకు ఇస్తారు. ధనొరా అనే వూరు చిన్నది. యధోచితముగా ముసాఫరులకు కావలసిన సామానులు ప్రయత్నముమీద దొరుకును. నేను నదియొడ్డున డేరాలలో వసించినాను. బ్ర్రాంహ్మణుల యిండ్లు లేవు. ఒక అంగడి యున్నది. యీ ప్రాత్యపు గ్రామాలలోనంతా వర్షాకలములో కాలుపెట్టను మనసురాదు. అసహ్యమయిన అడుసు. నడమ గ్రామములున్నవి. యిక్కడ యీ రాత్రి నిలిచినాను.

7 వ తేది ఉదయమైన 6 ఘంటలకు బయలుదేరి 1 ఘంటకు 7 కోసుల దూరములో నుండే కాయరా అనే వూరు చేరినాను. దారి నిన్నటి దారివంటిదే. చిన్న వాగులు శానా వర్షాకాలములో దాటవలసి యున్నవి. యిదిగాక ఒకరాతి గొట్టుకల కనమ యెక్కి దిగవలసి యున్నది. యీ కనమ మీద ముందు వెనక అడివి కలిగియున్నది. యీ యడివిలో మేకల గండిలోనున్న యీగెలవంటి యీగెలు నడిచేవారిని బాధ పెట్టుచున్నవి. రోనేగరుగాం అనే వూరితో యీయడివిసరి. అవతల పొడిచెట్లుగాని భయములేదు. కాయరా యూరి ముందర నొక పెద్దవాగు దాటవలెను. కాయరా అనే యూరు బస్తీయయినది. నాయబు ఉండే కసుబా స్థలము. సకల పదా