పుట:Kasiyatracharitr020670mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చినాము. కొండల చెరువుల నడమ భాట పోతున్నది. అట్నూరి వద్ద నొక పెద్దవాగు దాటవలసినది. యింకా శానాశానా చిన్నచిన్న వాగులు దాట వలిసియున్నవి. నిర్మల మొదలు భాటలో సన్నముగా, విడువుగా నిండే చీకటి యీగెలు నిండా కరుచుచున్నవి. యీ మేకల గండి యడివిలో నడిచే టప్పుడు నడిచేవారు చిన్న మండలు విరిచి చేతపట్టుకొని తోలుకొనుచు రావలసినది. ఆ మక్షికాల భాధ ఘాటు దాటే పర్యంతముగలదు. ఆఘాటు ములులే అనే యూరి పర్యంతము ఉన్నది. ఆఘాటును మేకలగండి అనటానికి కారణమేమంటే ఘాటు మధ్య వుండే రాళ్ళన్ని మేక అడుగులతో ఈశ్వరుడు సృస్టిచేసి యున్నాడు. యేదులాబాదులొ సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పనివాండ్లు వున్నారు. జలవసతి కలదు. బ్రాంహణ యిండ్లు కలవు. ఊరికి బయిట బ్రంహ్మచారి బావా మఠ మున్నది. వూరి మధ్యే కొన్ని మఠాలున్నవి. ఒక మఠములొ దిగినాను. విచ్చోడా అనే వూరు మొదలుగా వోణి అనే వూరు వరకు ముషోర్మల్కు అనే దివాంజీకి జాగీరు అయివున్నది. యీ యేదులాబాదులో నాయబు అనే అములుదారు డున్నాడు. ఈయూళ్ళోకూడా వచ్చిన వారియొక్క అసోదా నిమిత్తమున్ను, పదార్ధాల సంగ్రహము కొరకున్ను ఆ దినమంతా నిలచినాను.

6 వ తేది ఉదయమైన 6 ఘంటలకు బయలు వెళ్ళీ 8 కొసుల దూరములో నుండే ధనోరా అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను. దారి నల్లరేగడ అయినా అడుగున రాతిపారు గనుక నెంత వర్షముకురిసినా ఆట్నూరు వర్యంతము దిగబడేలాకు ఈదారి దిగబడదు. దారి కిరుపక్కల భూమి వెల్లడిగానున్నది. ఆదివిలేదు. అయితే దారి రాతిగొట్టు. శానా వాగులు వర్షాకాలములో దాటవలసి యుంచున్నవి. యేదులాబాదుకు కొంత దూరములో నొక పెద్దవాగు మధ్య వుండే జేనదు అనే వూరి వద్ద నొక పెద్ద వాగు దాటవలెను. ఈ జేనదు అనే యూరు మంచి బస్తీ అయినది. ముచ్చటగా రాతి పని చేసిన యొక విష్ణు దేవాలయము ఈ యూరి చెరువు గట్టున వున్నది. సకల పదార్ధాలు దొరుకును. యేదులాబాదుకు సమీపముగా