పుట:Kasiyatracharitr020670mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబలముగాదు గనుకనున్ను యిటువంటి వారు యీశ్వర చిద్విలాసానికి సామాగ్రి గనుకనున్ను, వారినిన్ని యీశ్వరుడు రక్షింపుచున్నాడు.

31 తేది మధ్యాహ్నము 12 ఘంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరు 4 ఘంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు ప్రక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది. నదిదాటగానే ఒక బంగాళా జాతులవాండ్లు దిగడానికి యోగ్యమయినదిగా నున్నది. యివతల చిన్న యూళ్ళు మూడున్నవి. కొన్ని మజబూతి అయిన పాడుకోట లున్నవి. నిర్మల అనేయూరు పట్టణము వంటిది. సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పని వాండ్లున్నారు. ఊరుచుట్టున్నూ, ఊరు నడుమనున్ను చిన కొండలు నిండా వున్నవి. గొప్ప యిండ్లు కలవు. ఊరుకి చుట్టున్ను, తొటలు, చెరువులు కలిగి యున్నవి. ఇక్కడ అరికాటి నబాబు కింద లోగడ రాయిజీ *[1] సర్వాధికారిగా ఉన్నట్టు ఒక పరగణాదారుడు ఉన్నాడు. దేశముఖి, దేశపాండ్యాలు ఉన్నారు. కొత్తవాలు మొదలయిన యధికారస్థులున్నారు. 100 బ్రాంహ్మణ యిండ్లును, ఒక దేవాలయమున్నూ ఉన్నవి. అక్కడ నేను దిగినాను. యిట్లా గొప్ప యూళ్ళలో నుండే బ్ర్రాంహ్మణ మండలికి సభాపతి అనే ఒక బ్రాహ్మణుదు ఉన్నాడు. అతని యూజ్ఞకు తక్కిన వారు యధోచితముగా లోబడి యున్నారు. నిర్మల పంచపాత్రలు ఈప్రాంతములలో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. అయితే కూతురి ప్రౌఢమ తండ్రికి ఏప్రకారము అనుభవానికి రాదో అలాగే ఆయాపదార్ధాలు పుట్టే స్థలముల యందు అచ్చటివారికి అనుభవానికి రావు. అందుకు దృష్టాంత మేమంటే యిక్కడచేసే పంచపాత్ర యొకటి చూతామన్నా యీ యూరున దొరికినదికాదు. ఈ నిర్మల నుండే పొష్టు రన్నర్సులనే టప్పా

  1. *ఆర్కాటు నవాబుకింద రాయరేడ్డెరావు అను నతడు శిరస్తాదారుగా నుండేవాడు. ఇతడు 1809 లో బలవన్మరణము నందినాడు.