పుట:Kasiyatracharitr020670mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనుష్యులు హైదరాబాదు పోష్టాఫీసు యిలాకావారు ఇది మొదలుగా నుండే టప్పా మునుష్యులు నాగపూరి పోష్టాఫీసు యిలాకావారు గనుక రెండు యిలాకాలకు న్నిద్దరు మనిషీలు ఇక్కడ నున్నారు. నాగపూరు మనిషీగుండా నగపూరు వరకూ నొకటప్పామనిషిని మజిలీ మజిలీకిన్ని కూడా వచేటట్టు దిట్టము చేసుకొన్నాను. వూరి అములు దారుడు నేను వచ్చేటందుకు మొందరనే తగయిరు అయినాడు గనుక దేశపాండ్యా వెంకటరాయనివారిగుండా యేదులాబాదు వరకు వచ్చే టట్టు 4 మంది ఆయుధ పాణులయిన జవానులను తయినాతి చేసుకొన్నాను. ఈ నిర్మలలో దృశ్యాఅనేవాడు. నిజాముకింద అధికారము చేసేవాడు. అతడు తన రాజ్యపురూకలు యజమానునికి పంపించకుండా తన చేతికిందనున్న భూమిని ఆక్రమించవలనని కోటలు కట్టి యజమానునితో చచ్చేవరకు యుద్ధముచేయుచు రాజ్యము ననుభవింపుచువచ్చినాడు. నేను దిగిన దూదుగాము అనేది నదీతీరమదలి యూరు. బహు రహధారి. కశిభాటలో నున్నది. ఆ నిర్మలలో మొదటి తేది ఉంటిని.

ఆగస్టునెల 2 తేది ఉదయాన 6 ఘంటలకు ఉదయాన బయలువెళ్ళీ 8 కోసుల దూరములో నుండే వొడ్డూరు అనె యూరు 1 ఘంటకు చేరినాను. దోవ బహు ప్రయాస. నల్ల రేగడి భూమి. వర్షాకలములో నడిచేవారికి అడుగు అమడగా నుండును. 7 కొండలు దారిలో నడిచేవారికి నెక్కి దిగవలసియున్నది. దారిలో అడుసుతో కూడా రాళ్ళు మిశ్రములై యున్నవి. దారిలో అంకిరి అనే యూరున్ను మరికొన్ని చిన్న యూళ్ళున్నున్నవి. మజిలీ చెయ్యడానికి వయిపు అయినవి కావు. యీ నిర్మల్ నుంచి నేరేడు కొండ అనే యూరిమీదనొక భాటపోవుచున్నది. అ భాట సమీపమయినా వర్షాకాలములో నడవకూడదు. యీదినము నడిచిన భాట కిరుపక్కల దట్టమయిన యడవి. వ్యాఘ్రభయము జగనంపల్లె మొదలుగా కలిగియున్నది. పాంకిలి అనేయూరివద్ద ఒక వాగు దాటవలెను. ఇది బలమయిన వారు. అవతలి యూరి ముందర నొక లోతుగల వాగు ఉన్నది. యిదేగాక అనేకములయి గనుక చిల్లర వాగులు అనేకములు దాటినాను. ఈ