పుట:Kasiyatracharitr020670mbp.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భాషలయినందున ఆమాటలు తెనుగుభాషలో గలిపి మాట్లాడుచున్నారు. ఈదేశములో ఈగలు బహు బాధపెట్టుచున్నవి. వర్షా కాలమయి నందున యిటు విస్తారమయిన దని చెప్పుచున్నారు.

కృష్ణ మొదలుగా గోదావరివరకు డ్రావిళ్ళు లెరుగదా? ఆంధ్రులుగా నుండే బ్రంహ్మణులందరు సగోత్రముగాక ఋషిప్రవనర కలియక పొయి నట్టయితే మధ్యదేశమువలె వెలనాడు, కాసలనాడు అనే తెగలు విచారించక సంబంధములు చేయుచున్నారు. లౌకీకులను వ్యాపారులను చున్నారు. మధ్యదేశపు సిద్ధాంతి పంచాంగముతో ఈ గొదావరీ తీరములో నుండే అనేక సిద్ధాంతులు గుణియించిన పంచాంగాలను సరిపెట్టినాను. తిది వార నక్షత్ర యోగ కరణములు అహ: ప్రమాణములు అరగడియ యేక్కువ తక్కువగా సరిపడుచు వచ్చుచున్నవి. యీదేశ పంచాంగములో శూన్యతిధులు, తిధిద్యయాలు వ్రాయడము లేదు. తద్ద్వారా పంచాంగపు వారి మూడ్యముచేత తిధులు ముణిగిపోవుచున్నవి. వైదికులు పాగా, చొక్కా లేక, ఆశీర్వాదము చేసే సంప్రదాయము లేదు. ప్రతిద్వ్జునకున్నూ చేత పంచంగ ముండవలసినది. పంచాంగశ్రవణము బహుప్రబలము. ఈదేశములో యిప్పట్లో వర్షా కాలము గనుక మన దేశపు కార్తిక మాసములోని వ్రతములు శ్రావణమందు శ్రావణ సోమవారలని, నిత్యాభిషేకాలని, సక్త భోజనాలని, ఛెయుచున్నారు. గృహకల్లోల కార్యములలో పురుషులకన్నా స్త్రీలకు చొరవ యెక్కువగా యీ దేశములో కలిగియున్నది.

కడప మొదలుగా గొప్ప వర్తకులు, ధనికులున్నుండే స్థలములో నొక్కొకవేళ డాగావాండ్లనే దొంగలు అతి ధైర్యముతో సాయంకాలములో గుంపుగా ప్రవేశించి యెదట కండ్లపడ్డ వారినంతా చంపి ధనికుల యిండ్లలో, అంగళ్ళలో జొరపడి ఖామందులను పోడిచి చంపి, ఉండే ధనము నెత్తుకొని, అరగడియలో మటుమాయ మయి పోవుచున్నారు. యీప్రకారము హయిదరాబాదు యింగిలీషు లష్కరు మధ్యె జరిగినది. యీ డాగావారి భయము యీ దేశములో విస్తరించి కలిగియున్నది. సాత్వికుల యోగ్యత యిటువంటి దుష్టులు లేకనే