పుట:Kasiyatracharitr020670mbp.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకారము దిగిన గ్రామము నుంచి అవతల దిగిపొయ్యే గ్రామనునకు పంపుచు వచ్చినాను. ఆరాత్రి దేవాలయములో చేరిన భ్రాంహ్మణ గృహమందు నిలిచినాను.

23 తేదీ ఉదయాన 3 ఘంటలకు బౌయలుదేరి అక్కడికె 5 కోసులదూరలో నుండే కామారెడ్డిపేట 10 ఘంటలకు చేరినాను. కృష్ణదాటినది మొదలుగా ఆ బిక్కనూరిపేట పర్యంతము దోవ గులక యిసక కలసిన గట్టిరేగడభూమి. ఏకాల మందున్ను నడిచేవారికి ఒక శ్రమమున్ను ఇయ్యదు. ఆ భిక్కనూరుపేట వదిలినది మొదలు కామారెడ్డిపేట చేరే పర్యంతము కాలుదిగబడే నల్ల రేగడ భూమి; వర్షాకాలములో మిక్కిలి అడుసుగా నుంచున్నది. యెండాకాలములో ముండ్లవలెనే నడిచే వారికి గుచ్చుకొనుచు, కొంతదూరము భాట గులక యిసక పరగా నుండినా యీ నల్ల రేగడ భూమిలో పడే ప్రయాస అసౌఖ్యమును జ్ఞాపకానికి రానియ్యదు. దోవలో కొన్ని వాగులు దాటవలసి యున్నవి. ఆ కామారెడ్డిపేట వసతి యయిన గ్రామమే. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధాలున్ను దొగుకును. భ్రాంహ్యణగృహమందే దిగినాను. చెరువు వున్నది. జలవసతి గలదు. కృష్ణదాటినది మొదలుగా ప్రతిగ్రామములో నున్ను బియ్యము మంచిదిగా దొరుకు చున్నది. వడ్లపయిరు విస్తరించి హయిదరాబాదు మొదలుకొని పండుచున్నది. ఆరాత్రి అక్కడ వసించినాను.

24 తేది ఉదయమున 3 ఘంటలకు ఆ యూరు వదిలి అక్కడికి 4 కొసుల దూరములొ నుండే మల్లుపేట అనే గ్రామము 10 ఘంటలకు ప్రవేశించినాను. దోవనిన్నటికన్నా యెక్కువయయిన నల్లరేగడ్దభూమి. బహులోతుగల వాగులున్ను, చెరువు మడుగులున్ను దాటవలసి యున్నది. ఆ గ్రామము ఖిల మయినది. యధోచిత ముగా ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. దిగడానికి స్థలము లేక ఆ గ్రామమందు మూడు డేరాలు ఒక చావడివద్ద కొట్టించి దిగినాను. హయిదరాబాదు దాటినది మొదలు ప్రతి గ్రామానికిన్ని కోటలు బలమయినవి లేవు. కొన్ని కొన్ని గ్రామాలలో బురుజులు