కనబడుతూవుంది. అంతలో ఒక బంగాలీవాడు నా వాలకం కనిపెట్టాడు. వీడెవడో తెలుగువాడురా అనుకొన్నాడు. ప్రీతిపూర్వకంగా వాడిభాషతో ఎక్కడకు వెడతావు భద్దీ అని ప్రశ్నించాడు. కోయిల్ ఘాటుకు అని వచ్చీరాని హిందీతో జవాబు చెప్పాను. దానిమీద వాడికి మటీ లోకువ చిక్కింది. ఒకమాట చెప్తాను వింటావా అన్నాడు. చెప్పమన్నాను. కోయిల్ ఘాటులో కన్న తక్కువ సొమ్మకు టిక్కెట్టు ఒక బంగాళీబాబు ఇస్తున్నాడు. నేను కూడా జగన్నాథం వచ్చేవాడనే. నేనక్కడనే పుచ్చుకొంటాను. నాతోకూడావస్తే నీక్కూడా తేలికగా టిక్కెటు యిప్పిస్తాను రమ్మన్నాడు. వాడిమాటలవల్లనే యెంత తెలివితక్కువవాడికైనా మోసగాడని తెలుస్తోంది కదా. అట్టి స్థితిలో అంతో ఇంతో లోకజ్ఞానం కల నాకు తెలియదనడానికవకాశం లేదుగాని, తెలిసినా, వాణ్ణి నేనెల్లా తప్పించుకోగలను? ఎట్లో నావద్ద నున్న సొమ్ము కాజేయడానికి వాడు సంకల్పించాడు. ఆ సొమ్ముతో నన్ను వదిలితే అదే చాలునని నేననుకొన్నాను, వానితో కూడా తోడేలుతో వెళ్లే మేకలాగు రాజవీధిలో పోతూవున్నాను. కొంతదూరం వెళ్లిన మీదట ఒక పెద్ద మేడ గుమ్మడికాయవాటంగా ఉన్నది కనుపడ్డది. దాని మెట్లత్రోవ ఒక చిన్న వీధంత వెడల్పుగా వుంది. ఆ త్రోవని మేడమీదికి త్రోవ తీశాడు. ఇక అయిదాఱు మెట్లల్లో పైకి వెడతామన్నప్పుడు నన్ను జూచి, సొమ్ము నాచేతికియ్యి, నువ్విక్కడేకూర్చో, నిన్ను చూస్తే ఎక్కువ తెమ్మంటాడు, నావద్దనున్న పదహారురూపాయిలున్నూ పుచ్చుకొని పైకి వెళ్లాడు.
పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/50
Appearance