మీద పాత్ర వుంటే మంట యొక్కడో వుండడం. ಅಜ್ಜಿ స్థితిలో చేతగాని నేను వంటేమి చేయగలను? సహాయుడు కోమటిగదా? వంట మట్టుకు నేను చేస్తే తక్కిన యావత్తు పనులను అతడు సవరణ చేయగలడు. ఎట్లాగయితేనేమి, బజారువెళ్లి రొట్టెలు కొనుక్కొని తెచ్చుకొని తింటూ వారం రోజులు కాలక్షేపం చేశాము ఆ కలకత్తాలో వారం రోజులున్నా మాకేమి నిల్వనీడ దొరకనేలేదు.
బంగాలీవాని మోసం
ధర్మశాలలో జనంవల్ల అక్కడినుండి జగన్నాథానికి వెళ్లడానికి త్రోవ మాత్రం తెలిసింది. ఆ త్రోవ కొంత సముద్రం మీద, కొంత కాలువలమీద, కొంత మెట్టను, ఈలాగునవున్నది. ఎట్లో బయలుదేరి పోతే తప్ప ఆ కలకత్తాలో బజారు రొట్టెలతో ఎన్నాళ్లుపవాసాలు చేయడం? కాలార్థకంనాడు భంగు పుచ్చుకొన్న దోషంవల్ల కల్గిన గ్రహణి మఱింత హెచ్చ మొదలు పెట్టింది. అందుచే ఆ కలకత్తానుండి బయలుదేరుట కయి స్టీమరుకు టిక్కెట్టు తేవడానికి కోయిల్ ఘాటుకు బయలుదేరాను. కోమటి బసలో కాశీకావిళ్ల వద్దనే వున్నాడు. అతడు వీధిలోకి వెళ్లినప్పుడల్లా త్రోవతప్పి పావలా అర్ధా లంచం ఇచ్చి అతి కష్టంమీద బసకు చేరుతూ వుండేవాడు, నేను మాత్రం వెళ్లిన త్రోవ జ్ఞాపకం పెట్టుకొని, అవధానం చేసినంత పని చేసి బసకు చేరుతూ వుండే వాడను. అందుచే టికట్టుకోసము పదహారు రూపాయలు పుచ్చుకొని నేను బయలుదేరాను. ఒక ఫర్గాంగు వెళ్లాను. కోయిల్ ఘాటు