వలెనే నాట్యము సల్పుగాక యని ప్రార్థించుచూ మరల ప్రకృతముపక్రమించుచున్నాను.
నిర్జలైకాదశి
కాశీనుండి బయలుదేరుటకు త్రోవఖర్చులకు సౌమ్మ వచ్చినప్పటికీ, Ο Α)ΟS" బయలుదేరినట్లు వ్రాయ మొదలిడనేలేదు. మాటలా, కాశీ నుండి బయలుదేరడం! ఆ మహాక్షేత్రం వదిలిపెట్టడానికి యెంత మూర్ఖుడికీ సుఖసుఖాల మనస్సు వొప్పదు. వెడదామనుకొంటూ వుండగా, అనగా యింకా కాలార్ధకం చేసుకోవడానికి పూర్వం, "నిర్జలైకాదశి" వచ్చింది. జ్యేష్ఠ బహుళ యేకాదశిని కాశీలో నిర్ణలైకాదశి" అంటారు. ఆ రోజున గంగ యిటునుండి అటూ, అటునుండి యిటూ, ఈదడం ఒక ఆచారం, నేనూ, కృష్ణశాస్త్రిగారూ, తర్కసంగ్రహపు గురువు శోభనాద్రి శాస్రులవారి తమ్ముడు శేషశాస్త్రిగారూ, ఈ ముగ్గురమూ సామాన్యమైన మట్టికుండల నాధారము చేసికొని గంగలో నీదుచూ ఆవలికి వెళ్లి తిరిగీ అదే ప్రకారం ఇవతలికి ఈదుకొంటూ వస్తున్నాము. మాతోపాటు మావలెనే ఘటహస్తుడై పల్నాటిసీమనుండి కొలదికాలము క్రిందటనే వచ్చిన వేడొక విద్యార్థి కూడా వచ్చినాడు. వెళ్లేటప్పుడు బాగానే చేరినాడు. తిరిగి వచ్చేటప్పుడు నడిమికి వచ్చేటప్పటికి ఆతడాధారంగా నేర్పరచుకొన్న కుండ నీరు పోసుకున్నది. ఆ కారణంచే అతడు కెక్కుకెక్కు మని మునగడానికి సిద్ధమైనాడు, నేను సామాన్యంగా ఈదేవాడనేగాని, అలాంటి సమయంలో వేటొకని ప్రాణం రక్షించడానికి తగ్గంత