Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజీతగాణ్ణి కాను. నాతోవున్న కృష్ణశాస్త్రి, శేషశాస్త్రిగార్లిద్దరూ మంచి గజీతగాళ్లు. తమ రెండు కుండల్లో వక కుండ అతనికిచ్చి అతని కుండను తామిరువురున్నూ చెటో చేతితో పట్టుకొని ఆ నీళ్లను పారబోసి అతని ప్రాణం రక్షించడమే కాకుండా తాము కూడా అనాయాసంగా వడ్డును చేరగలిగారు. ఆ కష్ట సమయంలో ఆ విద్యార్థి నూలు కొబ్బరికాయలు విశ్వేశ్వరుని యెదుట కొట్టడానికి మొక్కుకొన్నాడు. వడ్డుకు వచ్చిన తర్వాత, “ఏమయ్యా? బొత్తిగా ఈతరానివాడవు, గంగనీదడానికి యేలా బయలుదేరావు” అంటే, “నాకేం తెలుసును, మీరు కుండ పట్టుకు బయలుదేరితే నే కూడా కుండపట్టుకు బయలుదేరా" నని జవాబు చెప్పినాడు. ఏమాత్రమూ లోకజ్ఞానం లేని యిట్టివాళ్లు పలువు రా క్షేత్రమునకు విద్యాభ్యాసానికి వచ్చి కొందఱు పూర్వపుణ్యవశంచేత చిరకాలానికి మహాపండితులై దేశానికి వచ్చి అనేకులను శిష్యులను పండితులను జేయుటా కలదు. కొందఱు అక్కడనే సత్రాల్లో పొట్ట పోసుకొంటూ యావత్కాలమున్నూ గడుపుటా కలదు. అందుచేతనే, ఆ కాలంలో నేమి, అంతకు పూర్వకాలంలో నేమి, రైలుసాయం లేకుండినా యెట్లో కష్టపడి పలువురు కాశీకి చదువుకని వెళ్లిన వారిలో ప్రజ్ఞావంతులై వచ్చినవారి పేళ్లు పరిమితంగానే మనకు వినబడతాయి. భాగవతుల హరిశాస్రుల వారు, పుల్లెల దక్షిణామూర్తి శాస్రుల వారు, మార్కొండపాటి చతుష్టయంలో యిద్దఱు, దండిభట్ల విశ్వనాథ శాస్రులుగారు, మా గురువుగారు, మంత్రవాది లక్ష్మీ నారాయణశాస్రులుగారు, కొవ్వూరు గోపాల శాస్రులు గారు, శ్రీపాద రామశాస్తులుగారు,