యని విమర్శకులు గ్రహిస్తారుగాని, సామాన్యులో - "నాళీకజాద్యదితిజాళీ" అనే శ్లోకాలు చదివి మిక్కిలిగా మెచ్చుకొంటారు. ఎంత అర్ధప్రధానంగా తేలికగా కవిత్వం చెప్పేవాళ్లేనా, మొట్టమొదట కొంత కఠినంగానే కవిత్వాని కుపక్రమిస్తారేమో అని నేనను కొంటూను. దానికి నా వెుదటి కవిత్వానికీ యిటీవలి కవిత్వానికీగల భేదమే నాకు ప్రమాణం. కాశీనుండి వచ్చేముందు ఏదో కొంతసొమ్ము కట్టే యెడల, శ్రీ అన్నపూర్ణా మహాదేవిని స్వయంగా పూజ చేయనిస్తారని విని, ఒకరోజున ఆ విశాలాక్షిని సొమ్మకట్టి స్వయంగా పూజచేసి నాను. అప్పుడే ఆ యంబిక పై నొక యుష్టకమును రచించినాను, అందొకచో "మత్సద్మని స్టీయతామ్" అని ప్రయోగించితిని. ఆ వాక్యమున కర్థము, అమ్మా ! ఓ యన్నపూర్ణమహాదేవి ! నిన్ను నే నేకోరికనూ విశేషించి కోరేది లేదు గాని, నీవు మా యింట నివసించవలసినది. ఇదే నా ముఖ్య కోరిక అని. అది మొదలు ఇప్పటి వఱకు అనగా సుమారు నలుబదియైదు వత్సరముల నుండియు నా యింట దినదినాభివృద్ధిగా అన్నపూర్ణ తాండవించుచున్నట్లే నేను తలంచు చున్నాను. అట్లు తాండవించుటకు కారణము, నేను నాడు శ్లోకముద్వారా అట్లు వరమడుగుటయే యని నా విశ్వాసము. నేను అది మొదలు ఇంతవఱకు నవరాత్రములలో పూజించు విగ్రహము, అపుడు కాశీనుండి కొని తెచ్చిన చిన్న అన్నపూర్ణ ప్రతిమయే. ఆ ప్రతిమ హస్తమందు ఒక గరిటె యుండును." భవిష్యత్కాల మందు కూడా తరతరముల వఱకూ శ్రీమదన్నపూర్ణా విశాలాక్షి మాయింట యిదివఱలో