పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయనకు అప్పటికి ఘనాంతం స్వాధ్యాయం అయింది. పైగా ఆబ్దికమంత్రం వగయిరా చిల్లరలుకూడా వచ్చును. ఆయన తీర్ధవిధికి భోక్తగా కుదిరితే పితృదేవతలు మజీత్వరలో తరిస్తారని ప్రతివారున్నూ వచ్చి ఆయనను ప్రార్థించే వారు. ఆయనకున్నూ నాకున్నూ మైత్రి యొక్కువ. కాబట్టి నేను రెండోబ్రాహ్మణుడను కావడం తటస్థించేది. భంగుఖర్చూ, యజ్ఞోపవీతపుఖర్చూ కాక ಅಧ್ಯ, పావులా, దక్షిణ కూడా దొరకేది. ఈ బాపతు ఖర్చుకాగా మిగిలింది కొంత నావద్ద నిల్వయున్నది. మావాళ్లు పంపినదీ, ఇదీ కలిపి నలభై రూపాయలు తేలినవి.

భంగు పానయోగం

ఈ సొమ్మలో కొంత గంగ పట్టడానికిన్నీ కాశీకావిడికిన్నీ కాలార్థకం చేసుకోవడానికిన్నీ ఖర్చయినాయి. కాలార్థకమంటే, కాలభైరవ ప్రీతికి చేసే సంతర్పణ. ఆ సంతర్పణనాడు భంగుకూడా చేయక తప్పదు. భంగంటే, గంజాయిన్నీ ఏలక్కాయల పైనుండే తొక్కలున్నూ ఎండిన గులాబీపువ్వుల రేకులున్నూ, సోపున్నూ కలిపి నూరి ముద్దచేసి నీళ్లలో కలిపి తాగే మత్తుపదార్ధము. కాశీ దేశంలో ఈ భంగును ఈ రీతిగా సేవిస్తే లేశమున్నూ తప్ప లేదు. గంజాయి పొగరూపంగా పీలిస్తే చాలా తప్ప. ఒక్కొక్క దేశములో ఒక్కొక్క ఆచారము. మన దేశాన్నుంచి వెళ్లిన ప్రతివిద్యార్థిన్నీ దీనిని అభ్యాసం చేస్తాడు. ఎవడో నాబోటి పైత్యప్రకృతిగలవాడు అభ్యాసం చేయకపోతే వాడికికూడా బలవంతముగా ఎట్లో అంతో యింతో పోస్తారుగాని, వూరుకోరు. నేను కాలార్థకం చేసిన