ప్రాతర్భావీ బుధేంద్రామహాఇహభవతాం యాచతే సన్నిధానం
సుబ్రహ్మణ్యశాస్త్రీ ద్రవిడకులభవ స్స్వాహితాగ్నిర్వినీతః
శాస్త్రజ్ఞలలో నెక్కడో కాని కర్మఠులుండరు. వీరు అహితాగ్నులు." ఇంతకూ వీరికి నేను ప్రశిష్యుడ నగుదునుగాని, శిష్యుడను గాననునది ప్రకృతాంశము.
కూనిరాగపు గాలిసంగీతం
అడవి శంకరరావుగారు, నేను ప్రత్యేకించి విజయనగరము సంగీతము నభ్యసించుటకు వెళ్లినట్లు వ్రాసియున్నారు. అదికూడా పొరపాటే. చాలవలకు దేశాటనం చేసి అవధానాదులొనర్చిన తరువాత, విజయనగరం మహారాజా వారి సందర్శనానికి వెళ్లినప్పట్లో, శ్రీవారి దర్శనమునకు కొన్ని విఘ్నములు * రావడంచేత, సుమారు రెండుమాసములకంటె యొక్కువరోజులు విజయనగరంలో వుండవలసి వచ్చింది. అప్పుడు వృథాగా కూర్చోవడ మెందుకని సాలగ్రామ గోపాలంగారి వద్ద ఫిడేలు మీద సరళిస్వరాలు మట్టుకు కృషిచేశాను. ఇంతకున్నూ చదువరులు తెలిసికో దగ్గది నేను సంగీతము నేర్చుకొన్నవాడను కాననే విషయము. కొంచెము పద్యము రాగ ధోరణిమీద చదివిననూ, అంతమాత్రంచేత నేను సంగీతపాటకుడను గాను. ఆ చదవడమేనా, నేను పదకొండు పండ్రెండు సంవత్సరముల వయస్సులో నున్నప్పుడు, తోలుబొమ్మలాటలో పాల శంకరుని మేళంలో ఒకానొకడు పాడే మోస్తరును అనుకరించి నేర్చుకొన్న పాటగాని నాది స్వరా