Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీతారామ - శాస్రులుగారు దామోదరశాస్త్రులు | గారు యింకా, యెుందeటో వున్నారు. ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్రులు గారికి శ్రీ దర్భాంగ వువహారాజా లక్షల కొలది పెట్టికట్టించిన దశాశ్వవేుధ ఘట్టంలోని మహా సౌధమును నివాసముగాఇచ్చి, నెలకు నూఱు రూపాయిలు జీవనార్థం పంపిస్తూ, అప్పుడప్పుడు వచ్చి తామే దర్శనం చేస్తూ సమ్మానించే కాలమది." ఈకాలమునకు ఆకాలమునకును గల భేదమును చదువరులు గుర్తింతురు గాక.

సుబ్రహ్మణ్యశాస్త్రులు గారు

సుబ్రహ్మణ్యశాస్రులవారు వేదాంతశాస్త్రములో బంగాళాదేశ పండితుల నెల్ల జయించిన వారు, దక్షిణదేశీయులు. వీరు మా గురువుగారు బ్రహ్మయ్య శాస్రులవారికి వేదాంతశాస్త్ర గురువులు. అడివి శంకరరావు గారు నన్ను గూర్చి వ్రాసిన చరిత్రలో, నేను కాశీలో వీరివద్ద వ్యాకరణం చదివినట్లు వ్రాసినది పొరపాటు. వీరు నాకు గురు గురువులు. వీరు వ్యాకరణ పండితులు కారు, వేదాంత పండితులు. నేను కాశీలో నున్న రోజులలో ఈ శాస్రులవారి కొమార్తకు వివాహం జరిగినది. అప్పుడు ක්‍ෂීග්‍රාහ්” నున్న శ్లోకము మాత్రము నేను రచించినది. ఆ శ్లోక ముదాహరించినచో నేను కాశీలో విద్యార్థిగానున్న కాలము స్పష్టమగునుగాన, దాని నిట లిఖించుచున్నాను.

శ్లో || మన్య్యంకేందువర్నే గుణగణమహితే రాధమాసే వళక్షే
పక్షేఖ_నంగస్య తిథ్యా మసురగురుదినే మత్సుతాయా వివాహః