దులకు సంబంధించినది కాదు. నేను తఱచుగా రేగుప్తి, లేక మోహన, ఈ రాగాలమీద పద్యములను చదువుతానని పలువురు శ్రోతలనగా వినియున్నాను, కాని నా చదివేచదువు రేగుప్తిన్నీ కాదు, మోహన రాగమున్నూ కాదు, ఇంకేమిటంటే, ఈ రెండు రాగములేకాక, శ్రీ, సారంగ, మధ్యమావతి, నాటకురంజి, కాంభోజి. ఇంకా ఆయా రాగములతో అంతో యింతో చుట్టరికం గల రాగములన్నీ నా చదువులో చేరుతాయి. అందుచేత అనమ్మరాగేణ గీయతే' అన్నట్టుంటుంది. సంగీతపాఠకులు కూడా నా చదువును అభిమానించడం కలదుకాని, నా రాగ ధోరణి శాస్త్రీయమని మాత్రం వారు వొప్పుకోరు. నాకు స్వతస్సిద్ధమైన లయజ్ఞానము కలదు. అదిన్నీ పండితులొప్పదగిన విశేషములతో సంబంధించింది కాదు. గురుశుశ్రూష చేసి చెప్పికొంటే నేనొక పాటకుడ నగుదునని గాయకులు నన్ను అభిమానించే వారనడం కలదుగాని నాకు అట్టి నమ్మకం లేదు. నా బుద్ధిబలము నాకు తెలుసును. వినేటప్పటికెంత వస్తుందో అంతేకాని, యత్నంమీద రాదగ్గది నా కేదిన్నీ రాదు. ఇది అనుభవంమీద వ్రాసినమాట. నేను ఇంగ్లీషులో ప్రవేశించలేదుగాని, అందు లెక్కలలో నాకు సైఫరు తప్పదు. విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లివచ్చిన పిమ్మట, అనగా ఇరువదియైదు వత్సరముల ప్రాయములో (1895), ఇంకా నాకు సంసారభారం తలమీద పడనప్పుడు, మైసూరు వెళ్లి సంగీత మభ్యసిద్దామని బుద్ధిపుట్టి ప్రయాణసన్నాహం చేసాను. కాని తిరుపతి శాస్త్రి కొంచెం వెనుదీయడంచేత అది సాగిందికాదు. అంతో యింతో మా తండ్రిగారు గాలిపాట పాడేవారు. యానాములో వుండే
పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/34
Appearance