భోజనంతో కూడా పనే లేకపోయింది. ఆ అనారోగ్యంతో సుమారు ఇరవై రోజులు శ్రమపడి, తుదకు ఆయన స్వదేశగమనానికి సిద్ధమయి, త్రోవఖర్చులకు సొమ్మపంపమని అన్నగారి పేర వ్రాసుకొన్నాడు. నావలెనే ఆయనకూడా బీదకుటుంబములో వాడే అగుటచేత, కొంత ఆలస్యంగా ఆయన అన్నగారు సొమ్మ పంపినారు. సౌమ్మ వచ్చేటప్పటికి దైవకృపవల్ల కృష్ణశాస్త్రి గారికి ఆరోగ్యం కుదుటబడ్డది. ఆ కారణంచేత, వెడదామా, మానదామా? అని తటపటాయిస్తూ ఆయన తుదకు స్వదేశానికి వెళ్లక కాశీలోనే వుండి భాష్యాంతం చదివికొని పిమ్మట కొన్ని సంవత్సరాలకు స్వదేశానికి వెళ్లినారు.
విద్యా వ్యాసంగం
ఇక నేనో, గంగని ప్రార్ధించడం వల్లనో, నాయందా కాశీవిశ్వేశ్వరునికి దయే కలిగిందో చెప్పలేను గాని, స్వదేశంలో కన్న మంచి ఆరోగ్యముతో వుండడం తటస్థించింది. జిల్జన చీదని స్థితిలో వుండి కావ్యపాఠం చదివికొనే యిద్దఱు విద్యార్థులకు గురుత్వం చేస్తూ, శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్రులవారి వద్ద వ్యాకరణం తరువాయి చదవడానికి మొదలు పెట్టాను. నాకు అప్పటికి దేశంలో కౌముది పూర్వార్ధం సమాస ప్రకరణం కొంతవఱకున్నూ ఉత్తరార్థం తిజంతం కొంతవఱకున్నూ అయినది. అంతేకాకుండా, ఎవరేది చదువుతూంటే అది విని అంతో యింతో గ్రహించే శక్తి వుండడంవల్ల, తత్త్వబోధినిలో నేమి, మనోరమలోనేమి, శేఖరంలో నేమి, కొన్ని కొన్ని సంగతులు కూడా శ్రీ బ్రహ్మయ