పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దినమున్నూ ముప్పదిమందికి ఏర్పాటు చేసినాడు. ఈయన సత్రం సాగించడం" మొదలు పెట్టిన తరువాత కొందఱు నలుగురికీ అయిదుగురికీ పెట్టడానికి ఏర్పరచారు గాని, ఏమైనా అవిచ్ఛిన్నంగా ఈ వెంకన్నగారి సత్రమే జరిగేది. అంతత్వరలో నాకు రాత్రిభోజన సదుపాయం కుదరడానికి కారణం కవిత్వమే. ఆ నారద ఘట్టములో పలువురు తెలుగుదేశపు విద్యార్థులు వున్నా ఒక్కరున్నూ కవిత్వం చెప్పేవారు ඒජා. శాస్త్రంలో కొంతమంది ప్రవేశం కలవారున్నా సంస్కృతంలోనైనా మంచి సాహిత్యం కలవారు లేరు. తెలుగులో ప్రవేశం కలవారు లేరని చెప్పనే అక్కఱలేదు. ಇಟ್ಟಿ స్థితిలో నన్ను చూచేటప్పటికి మన దేశస్టులందటికీ ఎక్కడలేని ప్రేమా కలిగింది. వీళ్లందఱున్నూ నన్ను వెంటబెట్టుకొని వెళ్లి అంతవాడు, ఇంతవాడు, పైగా అష్టావధాన శతావధానాలు చేస్తాడు’ అని వున్నవి కొన్నీ లేనివి కొన్నీ చెప్పేటప్పటికి, ఆ సత్రాధికారికి నామీద ప్రేమ పుట్టి వెంటనే నాకు రాత్రి భోజనం ఏర్పాటు చేశాడు.

ఇక నాతో వచ్చిన కృష్ణశాస్త్రికి రాత్రిభోజనం కుదరాలి. ఏదోవక వారం పది రోజులలో కుదురుస్తామని విద్యార్థులు చెపుతూ వున్నారు. మధ్యమధ్య ఆ పోస్టులు కూడా కాళీ అవుచుండడం తటస్థిస్తూ వుంటుంది. ఆ కాళీలో క్రొత్తవారిని ప్రవేశ పెటుతూ వుండడం జరుగుతూ వుంటుంది. అందుకోసం నిరీక్షిస్తూ వుండగా కృష్ణ శాస్త్రిగారికి గంగచేసే పరీక్ష ప్రత్యక్షమయింది. ఆ కారణంచేత, ఆయనకు రాత్రి భోజనం మాటట్టే వుండగా, పగటి