పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెండ్లి చేసి పంపుతాను. అతనితో మీరీమాట చెప్పి అంగీకరిస్తాడేమో కనుక్కోండి". ఈ మాటలకు గురువుగారు సమ్మతించారు. ఉదయము వారంతా కూర్చుని నన్ను పిలిచి యీ విషయము చెప్పినారు. చెప్పి దీన్ని గూర్చి మీ గ్రామము వెళ్లి మీ తల్లిదండ్రులతో ఆలోచించి ఏదో అభిప్రాయము తేల్చమన్నారు. దానిమీద నేను మా గురువుగారితో "మీకన్న మా తల్లిదండ్రులెక్కువ వారు కారు, తమ యిష్టమునకు వారు మాఱు చెప్పరు. కాబట్టి తమ చిత్తము వచ్చినట్లు జరిగింపవచ్చు" నని నేను ప్రత్యుత్తరము చెప్పితిని. ఇక్కడ నిక నొకటి చెప్పవలసియున్నది. ఏమిటంటే, నాకు అప్పటికి కాశీ వెళ్లి అక్కడ అధమం పండ్రెండేండ్లేనా వుండి గొప్ప పాండిత్యం సంపాదించి దేశానికి వచ్చిన పిమ్మటగాని పెండ్లి చేసుకోవాలని సుతరామున్నూ లేదు. అట్టి స్థితిలో గురువుగారు ఈ ప్రస్తావన తేవడంతోనే అంగీకరించడానికి కారణమేమంటే నాకు అప్పుడు వుద్దేశించిన కన్యక నే నెరిగినదే కాని క్రొత్తదికాదు. నే ననుకొన్నంతకాలమున్నూ కాశీలోనున్నను భార్య ప్రతిబంధక మేమిన్నీ వుండదని వూహించుకొన్నాను. ఆ తరువాత నా తరఫున గురువుగారు తల్లిదండ్రులై తథాస్తు అన్నారు. ఆ వేళ కార్తీక బహుళ త్రయోదశి; మార్గశీర్ష శుద్ధ తదియ సుముహూర్తము అనుకొన్నారు.

వివాహ సన్నాహం

వెంటనే గురువుగారు సంస్థానం వారికి కబురుచేయుటకయి మళ్లా దివాణంలోనికి ప్రయాణమయినారు. వార్షికము