Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముట్టినది కదా, ఏమి, మరల శాస్రులవారు దయచేయుచున్నారని వుద్యోగస్టులు ఆశ్చర్యంగా చూడ మొదలిడినారు. వారివారితో ప్రస్తుతము శ్రుతపఱచి గురువుగారు శ్రీ బుచ్చి సీతయ్యమ్మగారి ముఖ్యపరిచారికను కామాక్షిని పిల్చి, అమ్మగారితో ఈ సంగతిని మనవి చేయమని చెప్పినారు. బుచ్చి సీతమ్మగారనగా, అపుడు కిర్లంపూడి జమీను అనుభవించుచున్న శ్రీ యినుగంటి బుచ్చి తమ్మయ్య, చిన్నరావు గార్లకు మాతామహి. ఎస్టేటు మనుమలిద్దరికి వశపరచి చాలాకాలమైనది. ఆమెకు మనుమ లిద్దఱున్నూనెల 1టికి రు.500-0-0' చొప్పున మాత్రము గౌరవార్థం ఇచ్చుచున్నారు. ఈ అయిదువందలును ఆమె తన ముఖ్య పరిచారికయగు కామాక్షి చేతులో పోసి ధర్మఖర్చు చేయవలసినదని చెప్పచుండేది. ఈ పరిచారిక, అమ్మగారంత వృద్దు కాకపోయినా, సుమారు షష్టిపూర్తికి దాదాపు వయస్సులో వుంది. మిక్కిలి దేవ బ్రాహ్మణ భక్తిపరురాలు. జమీందారులవద్ద మెలగు చుండుట చేతనో, పూర్వపుణ్యవశంచేతనో ఉదారమైన గుణసంపత్తి కలది. ఎట్టిదియును గాకున్న ఆ జమీందార్లు బుచ్చి తమ్మయ్య చిన్నరావు గార్లు అందఱు దాసీలతోపాటుగాగాక, ఈ పరిచారికను కామన్నప్ప' అని వరుసవావులతో పిలవడం తటస్థింపదుగదా? ఈ పరిచారిక యెవరి నవుకరో ఆ బుచ్చిసీతయ్యమ్మగారిని గూర్చి కొంచమిచట తెలుపవలసియున్నది. ఈమె శ్రీ రావు నీలాద్రి రాయనింగారికి కోడలు. శ్రీ నీలాద్రిరాయనింగారి ప్రథమభార్యా పుత్రుడగు శ్రీ బుచ్చితమ్మయ్య గారి భార్య. ఈ బుచ్చితమ్మయ్య గారు శ్రీ పిఠాపుర సంస్థానము" ఏలవలసిన వారయ్యను, తలి