పుట:Kashi-Majili-Kathalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాపీడుని కథ

23

తెలిసికొని బ్రాహ్మణులకు షోడశమహాదానంబులును గావించిపుత్రోదయసమయ మరయుచుండిరి.

అంతఁ గాలక్రమంబునఁ బ్రసవసమయము సంపూర్ణమైనంత నద్ధరాకాంతు నిల్లాలు శుభదినంబున నుత్తమలగ్నంబున నంబుద మాలిక యిరమ్మదమునుబోలే సకలలోక హృదయానందకరుం డగు కుమారుం గాంచినది.

అప్పు డంతఃపురజనులు భూమిచలింప నిటునటు పరుగులిడు వారును మంగళగీతముల మ్రోగించువారును తూర్యనినాదములు వెలయించువారునై కోలాహలధ్వనులచే నాదేశమునెల్ల నిండింపఁ జేసిరి. ఆనగరమందే కాక యా దేశమందెల్ల జనులుత్సవములు సేయం దొడంగిరి.

తారాపీడుఁడు శుకనాసునితోఁగూడ బుత్రుం జూచు వేడుక ప్రబలదూర్వాప్రవాళమాలాలంకృతంబైన సూతికా గృహంబున కరిగి యందుఁ దొలుత నుదకము నగ్నిని స్పృశించి పిమ్మట విలాసవతి తొడపై దీపమువలెఁ బ్రకాశించుచున్న కుమారు దూరవిస్ఫారితములగు నేత్రములచేఁ బానము జేయువాఁడుంబోలె నీక్షించుచు మిక్కిలి సంతోషించెను. తన్నుఁ గృతకృత్యునిగాఁ దలంచు కొనియెను.

అప్పుడు శుకనాసుం డాబాలకుని యవయవములన్నియు నిరూపించుచు నిట్లనియె. దేవా! చూడుము. గర్భసంపీడనవశంబునం జేసి యంగశోభ స్ఫుటము గాకున్నను జక్రవర్తిచిహ్నములఁ బ్రకటన జేయుచున్నవి.

సంధ్యాకిరణరక్తుండగు బాలశశిరేఖంబురడించు లలాటపట్టిక యందు నళినీతంతువులం బోలిన సూక్ష్మ రేఖలెట్లు ప్రకాశించుచున్నవో పరిశీలింపుము. ఆకార్ణాంతవిశాలములై పుండరీకమువలెఁ దెల్లనై