పుట:Kashi-Majili-Kathalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కాదంబరి

కుటిలములైన కనుబొమ్మలచే ముద్దులు మూటగట్టుచు వెలికాంతుల వెదజల్లుచున్న వీని కన్నులగంటివా?

సీ. కరతలంబులు సుకోకనదకుట్మలలోహి
              తములు చక్రాదిచిహ్నములనొప్పె
    బదయుగంబమరద్రు పల్లవమృదులంబు
              కులిశధ్వజాది రేఖలఁదలిర్చె
    ఫాలంబు శిశునిశాపాలాభిరామంబు
              సార్వభౌమాంకలక్షణతమెఱసె
    గనుఁగవ సితపద్మ కమ్రంబు త్రిభువన
              ప్రభుతానుభావ వైభవముదెలిపె.

గీ. గంటివే వీని రూపముత్కంఠవొడమె
   నోనరేశ్వర! వింటివే వీనికంఠ
   రవము దుందుభివలె సుస్వరతనెసంగె
   వీఁడు బ్రోవఁగఁజాలు నీవిశ్వమెల్ల.

అని యబ్బాలకశిఖామణి యంగశోభావిశేషముల వర్ణించుచున్న సమయంబున ద్వారస్థులనెల్లఁ ద్రోసికొనుచు నతిరయంబున నొకపురుషుం డరుదెంచి ఱేనికిమొక్కి దేవా! విజయమగుఁగాక, శుకనాసునిభార్య మనోరమకు రేణుకకుఁ పరశురాముండు వోలెఁ గుమారుం డుదయించె నని యెఱింగించెను.

అమృతోపమితములగు నప్పలుకులు విని యజ్జనపతి బాష్పపూరితనయనుండై యోహో! కల్యాణపరంపర! మిత్రమా! శుకనాస! విధి సమానసుఖదుఃఖత్వమును సూచింపుచు నీడ వోలె నన్ననుగమించెంగదా? అని పలుకుచు నా వార్త తెచ్చిన పురుషునకపరిమితముగాఁ బారితోషికమిచ్చి యప్పుడ యప్పుడమియొడయఁడు స్రగ్గడతోఁగూడ నతనియింటికరిగి తత్సుతముఖదర్శనంబు గావించి పుత్రో