పుట:Kashi-Majili-Kathalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

కాదంబరి

డగు చంద్రుడు బ్రవేశించుచున్నట్లు కలఁ గాంచెను. దిగ్గున లేచి సంతోషాతిశయముతో నాక్షణమునందే శుకనాసుని రప్పించి యా వృత్తంత మెఱింగించుటయు హర్షపులకిత గాత్రుండై యతం డిట్లనియె.

దేవా! శీఘ్రకాలములో మనప్రజల మనోరథములు సఫలములుఁ గాగలవు. కొలఁదిదినములలోఁ గుమారముఖావలోకన సుఖంబనుభవింపఁగలము. మద్ధర్మపత్ని యగు మనోరమ తొడయందొక బ్రాహ్మణుండు దివ్యవస్త్రాలంకారభూషితుండై యరుదెంచి సహస్రదళశోభితంబగు పుండరీక మిడినట్లు నాకును నిన్నరాత్రియే కల వచ్చినది. మంచి నిమిత్తములు గనఁబడుచున్నవి. శుభోదర్కము దాపుననే యున్నదని పలుకుటయుఁ దారాపీడుం డతనిచేయి బట్టుకొని హృదయానందమును వెల్లడించుచు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువుర స్వప్నవృత్తాంతములును విలాసవతి కెఱింగించి సంతోష సముద్రములో నోలలాడించెను.

మఱికొన్నిదినంబులు గతించినంత దేవతాప్రసాదంబున విలాసవతి గర్భవతియయ్యెను. కులవర్ధన యను ప్రథానదాసి యొకనాఁడావృత్తాంతము శుకనాశునితో ముచ్చటించుచున్న ఱేని చెవిలో వైచినది. అశ్రుతపూర్వమగు నవ్వాక్యము విని యజ్జనపతి మేనంబులకలుద్భవిల్ల సంతసమభినయించుచు శుకనాశుని మొగ ముపలక్షించెను. శుకనాసుండయ్యుత్సవము గ్రహించి దేవా! మనకు వచ్చిన కలలు సత్యములైనవా యేమి? వినుదనుక నా హృదయము తొందరపడుచున్న దని యడిగిన నతండు సంతోషముతో దాది చెప్పిన మాటల నెఱింగించెను.

రాజప్రధాను లిరువురు నిరతిశయసంతోష సముద్రమున మునుంగుచు నప్పుడే శుద్దాంతమున కఱిగి యావార్త సత్యమని