పుట:Kashi-Majili-Kathalu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కాదంబరి

వయస్యా! మీతండ్రి నీకీ వార్తజెప్పి నన్ను వెంటనే యక్కడికి రమ్మని యాజ్ఞాపించెను. నేనిఁక బోయివచ్చెద. నీవు కర్మ పరిసమాప్తి వఱకు నీ మహర్షి పాదమూలమును విడువరాదు సుమీ! అని పలికిన విని విషణ్ణవదనుండనై యిట్లంటి.

కపింజలా! ఇట్టి యవస్థలోనున్న నేను దలితండ్రుల కేమని సందేశమంపుదును? అంతయు నీవే యెఱుంగుదువు. అనుటయు నతండు నన్నందుండి కదలనీయవలదని హరీతకునకుఁ బలుమారు జెప్పి యప్పగించి నన్ను మఱియొకమాఱు కౌఁగలించుకొని మునికుమారు లెల్ల విస్మయముతోఁ జూచుచుండ నంతరిక్షమున కెగిరి యంతర్ధానము నొందెను.

అతండరిగిన వెనుక హరీతకుఁడు నన్నూరడించుచు స్వయముగా నా కాహారాదిక మిడుచు నేకొరంతయు రాకుండఁ గాపాడుచుండెను. కొన్ని దినంబులకు నాకు ఱెక్కలు వచ్చినవి. ఇంచుక యెగురుటకు సామర్థ్యము కలిగినప్పుడే నాత్మగంబున నిట్లు విచారించితిని. నా మిత్రుఁడు చంద్రాపీడుని మహాశ్వేతను జూచుటకు నా మనసుత్సుకము జెందుచున్నది. నేనక్కడికిపోయి వసించెదనని తలంచుచు నొకనాఁడు ప్రాతఃకాలమున విహారమునకుం బోలె బయలుదేరి యుత్తరదిక్కు ననుసరించి యెగిరిపోయితిని.

స్వల్పదివసముల క్రితమే యెగరనేర్చితిని. కావునఁ గొంచెము దూరము పోయినంతనే నా యవయవములన్నియు విడిపోయినట్లాయాసము గరలిగినది. దాహముచే నాలుక యెండఁ జొచ్చినది. శ్వాసలు బయలుదేరినవి. ఱెక్కలాడింపశక్యము గాకుండెను. కన్నులు తిరుగుచుండెను. ఇక్కడబడియెద నిక్కడ బడియెదనని తలంచుచుఁ దూలుచు నా సమీపమందున్న సరస్సీరమందలి జంబూతరుని కుంజముమీద నతి కష్టమున మేనుఁజేర్చితిని.