పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రసేనారతి మంజరులకథ.

85

అప్పడంతులతని గంధమాల్యాను లేపనాధులచే నచిన్‌ంచి మహానందముతో మేడమీఁదికిఁ దీసికొనిపోయిరి. అవ్వార్త పరిచారికలవలనఁ దెలిసికొని రతినూపుర కోపావేశమునఁ గూఁతుండ దనచెంతకు రప్పించి యిట్లుమందలించినది.

ఉ. పుత్రికలార ! యేలయిటుపూనితి రక్కట? వంశధర్మ చా
     రిత్రములెల్ల మీకు విపరీతములయ్యెనె? మేలుమేలు లో
     కత్రయసన్నుతాకృతిఁ బ్రకాశిలు మీరిటు బోడిబాపలన్
     బాత్రులటంచుఁ గైకొనిన బక్కున నవ్వరె విన్నవారిలన్.

గీ. తిరుగుఁ డిటుమీఁద నిల్లిల్లు తిఱిపమెత్త
    నరుగఁ గలరిఁక మూసివాయనములందఁ
    దినుఁడు తృప్తిగ శ్రాద్ధభోజనము లెపుడు
    బోడిబాపనవారిఁ బెండ్లాడి మీరు.

అక్కటా! చక్రవర్తులకుఁ బ్రియురాండ్రఁగాఁజేసి యింద్రభోగము లనుభవింపఁ జేయవలయునని తలంచికొంటి. మీనొసట బాపన దాసరులంబెండ్లియాడి ముష్టియెత్తికొనునట్లు సృష్టికర్త వ్రాసియుండ నేనెట్లుతప్పింతు? అయ్యయ్యో ! కులస్త్రీలు మనలంజూచి ముచ్చట పడుచుండ మీరు పెండ్లి పెండ్లీయని పలవరించుచుంటిరేల ? ఇప్పు డెవ్వనినో మేడయెక్కించితిరట. వాని నిప్పుడే గెంటింతును జూడుఁడు ఆ గోచిపాతరాయనితో నందు గూర్చుండి కులుకుదుమను కొనుచుంటిరి కాఁబోలు నిదియంతయు నాస్వార్జితము గడియ నిలువనీయను మీ నగలన్నియు నిందుఁ బెట్టిపొండు నాయాజ్ఞోల్లంఘనమునకు సైరించు దానగానని మందలించినవిని యాసుందరు లలుక మొగంబునందొలక తల్లీ! నీ వెందఱియిండ్లో కూలిచి సంపాదించిన ద్రవ్య మనుభవించుట మహాపాతకము. మేమద్దాని కాసింపము. ఇవిగో నీ నగలు, ఇవిగో నీదుస్తులు. అనిపలుకుచు నాక్షణమ దానిముందఱవైచి జల్తారుచీరలు