పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పొండు. మీయిద్దరికీ మేము బరిచర్యసేయుచుందుము మాతల్లి మమ్ముఁ గులవృత్తిలోఁ బ్రవేశపెట్టఁ దలంచుచున్నది. మా కంగీకారములేదు.

శ్లో॥ జయంతితే సుకృతినో రససిద్ధాఃకవీశ్వరాః।
     నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం.॥

కవీంద్రులకు మహారాజులు సాటిరారు. అట్టివారికి భార్యలగుట కంటె భాగ్యమేది? మా యభిమతము సెల్లింపుఁడని కోరినవిని గోణికాపుత్రుండు ముసిముసి నగవులు నగుచు నిట్లనియె.

చిత్రసేనా ! నీవు మా దత్తునికి మిత్రురాలవగుట నాకును విస్రంభపాత్రురాలవైతివి. నీయుదంతమువిని సంతోషించితిని మఱియు దివ్యోపభోగయోగ్యంబులగు భాగ్యంబులువిడచి యాచ్నాలబ్ధ విభవులమగు మమ్మేల పరిగ్రహింపఁదలచుకొంటిరి? యీ సంకల్పము విరమింపుఁడు గుణాధికునివరించి యేకచారిణీ వృత్తంబునుబూని సుఖింపుఁడు మావెంటవచ్చి యిడుమలంబడలేరని యించుక వైమనస్యంబు సూచించుటయు రతిమంజరి యతని పాదంబులంబడి.

చ. కపటపు వైశికోక్త విధికైవడి దుష్టలమంచు మమ్ము ని
    ష్కృప విడనాడకయ్య పరికింపుము మాదగుచిత్తబుద్ధి మి
    మ్మపరితానురాగరతనై వరియించితి భర్తగాఁగ ధీ
    నిపుణ! పరిగ్రహింపుము వినీతగతిం బరిచర్య జేసెదన్.

అని ప్రార్ధించి తల్లికినిఁ దమకుంజరిగిన సంవాదప్రకార మంతయు నెఱింగించిన నాలించి యతండు తద్వాక్యంబులు సత్యంబులుగా నిశ్చయించి యంగీకారము సూచించె మఱియు

మ. సకలాలం కరణాభిరామ విలసత్సౌందర్య తేజోవిలా
     సకళా శోభితమూర్తికన్య యభిలాషస్ఫూర్తి మోహించి కో
     రికదెల్ప న్వలదంచు నాతఁడు నివారింపగ గాంధేయుఁ డా
    శుకుఁడా? వాయుతనూజు డా స్మరవిపక్షుండా? వితర్కింపఁగాన్.