పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

శ్లో. ఏతాశ్చల ద్వలయ సంహతిమేఖలోద్ధ
    ఝంకార నూపుర రవాహృత రాజహంస్యః।
    కుర్వంతి కస్యచ మనోవివశం తరుణ్యో
    విత్రస్తముగ్ధహరిణీ సదృశైః కటాక్షైః॥

దివ్యాలంకారశోభితలై మనోహర రూపలక్షణలక్షితలగు నంబుజాక్షులు ముగ్ధహరిణీసదృక్షములగు కటాక్షములచే నీక్షించిన నెవ్వని మనము వివశముగాకుండెడిని? అని పండితులు సెప్పియున్నారు కాదా ! అని యాలోచించుచుఁ జలించినహృదయమును గుదురుపరచుకొని అగునగు దెలిసినది. ఇది వేశ్యాగృహమని శ్లేషోక్తులచే నా యోషామణి సూచించినదికాదా. వీరిరువురు వేశ్యాపుత్రికలు నాపటాటోపంబుజూచి కపటవిటోపచారములం జేయుచున్నారు ? వీరి మాటలువినఁ జదివికొన్నవారివలె నున్నారు. కానిమ్ము అనితలంచి

శ్లో॥ ఛన్న కామ సుధా ర్ధ్ఞాజ స్వతం త్రా హంయు పండితాన్
      సక్తేవ రంజయే దాఢ్యా న్నిస్వా న్మాత్రా వివాసయేత్ .

ఛన్న కాముఁడు సుఖార్ధుఁడు. అజ్ఞుఁడు. స్వతంత్రుఁడు. అభిమాని నపుంసకుఁడు. ధనవంతులగు వీరిని, సక్తలవలెరంజింపఁజేసి ద్రవ్యమంతయు లాగివేసి దరిద్రులైనంత దల్లిచే లేవఁగొట్టింపవలయును. విదుషీమణీ! ఇదిగదా? మీకులధర్మము నేను వారిలో నొక్కండనుంగాను మీకపటకృత్యములు నాకడ నుపయోగింపవు. మఱియొకసక్తు నాశ్రయించుకొనుఁడు మీకావించిన యపూర్వ సత్కారమున కానందించితి దీవించి యేగెదనని పలికిన విని రతిమంజరి లజ్జావిలోలనయనాంచలయై యాలోచింపుచుండఁ చిత్రసేన యిట్లనియె.

ఆర్యవర్యా ! మేము వేశ్యాపుత్రికలమగుట వాస్తవమే? కులవృత్తి విసర్జించితిమి కులపాలికావృత్తి ననుష్ఠింపఁదలంచికొంటిమి. వినుం డిది నాచెల్లెలు దీనికిరతిమంజరియని మాతల్లి పేరుపెట్టినది. నేఁటియుద