పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    దత్తకాదులు బుధోత్తము లార్వురును సహా
                     ధ్యాయులు మిత్తసత్తములు నాకు
    నఖిలరాజాధిరాజా స్థానకవిశిఖా
                     మణులెల్లఁ బ్రతివాదిగణముమాకు

గీ. బోవుచుంటిని నేనిప్డు భోజరాజ
    రాజధానికిఁ గవిరాజ రంగభూమి
    కంబుజాయతనేత్ర! నెయ్యముననన్ను
    గోణికాపుత్రుఁడండ్రు మత్కులజులెల్ల.

క. మాదత్త కునకు నీపుట
   భేదన ముదయస్థలంబు ప్రియమనిచూడన్
   బైదలి ! వచ్చితి రాతిరి
   మోదించితి నిందు నిద్రబొంది సుఖముగాన్ .

తెఱవా ! తెఱవరుల కొరులనడుగకయే ప్రవేశించి సుఖింప నిరవేరుపరిచన యీభవనకర్తలు పుణ్యమూర్తులుగారే. వారిం గైవారంబుసేయరాదే నిన్నరాతిరి యదభ్రాభ్రఘోషభీషణంబై దుర్వార ధారాపాతసంజాతవాత ప్రభూతంబై యొప్పు శీతోపద్రవంబు బోకార్బనీశరణంబు నాకుశరణంబయ్యె నీయుదంత మెఱింగింపుము దీవించి యేగెదననిపలికినంత నాకాంతావతంసం బంసంబుల నెగరవైచుచునందువచ్చుచున్న చిత్రసేనునకుఁ బదియడుగులెదురువోయి చిఱునగవుతో

ఉ. దత్తునిమిత్రుఁడంట విభుధప్రవర ప్రవిగీతభూరి వి
    ద్వత్తముఁడంట పూతవసుధావిబుధాన్వయ జూతుఁడంట లో
    కోత్తరరూపభాసురవయో రుచిరుండొకపండితోత్తముం
    డుత్తరదేశవాసి యదియుండె గృహంగణమందు చూడుమా.

వానిపేరు గోణికాపుత్రుఁడంట గురుకృపాపాత్రురాల నగుట ననుకూలవాల్లభ్యంబు లభించినది నీవువచ్చి చూచి మాటాడుమని చెప్పిన