పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

దత్తకుఁడు కాశిలో ననేకశాస్త్రములు చదివి దత్తకాచార్యుఁడనిపేరు పొందెను. మఱియు లోకయాత్ర సేయదలంచి వేశ్యాజనమువలన దద్విశేషములుదెలియగలవని తలంచుచుఁదఱుచువారియిండ్లకుఁ బోవు చుండును. ఒకచో యక్షునిచే స్త్రీగా శపింపఁబడి తిరుగాఁగొంతకాలమునకు బురుషుఁడయ్యెనఁట దానఁజేసి దత్తకుఁ డుభయరసజ్ఞుఁడని ప్రసిద్ధిజెందెను. పురుషులరంజింపఁజేయు విథానము బోధింపుమని తన్ను వేశ్యాజనము ప్రార్థింప వైశికప్రకరణమురచించెనని వాత్స్యాయన సూత్రవ్యాఖ్యాన కర్త వ్రాసియున్నాడు. ఇతనిగుఱించి మఱియొక గ్రంథమున మఱియొకరీతిగా వర్ణిం పఁబడియున్నది.

ఏది యెట్లైనను నీయేడ్వురుమిత్రులు ఒక్క గ్రంథమునే పంచుకొని యట్లు తలయొక యధికరణమును వ్రాయుటచే నేకకాలికులని చెప్పకతప్పదు. తక్కినవిషయముల నిజానిజంబులఁ దెలిసికొనుటకు సృష్టించిన బ్రహ్మదేవునడుగవలసియున్నది. ఇందలి కథాచమత్కా.రమునే పరిశీలింపవలయునని చదువరులఁ గోరుచున్నాను.

వీరేడ్వురు కాశిలో విద్యలబూర్తిజేసి పండితులతోఁ బ్రసంగించి విజయమందనుత్సుకత్వము చెందుచు భోజునియాస్థానమునఁ బెద్ద పండితులున్నారనివిని మధ్యదేశవిశేషంబులం జూచుచు సంవత్సరము నాఁటికావీటికి జేరుటకునిశ్చయముజేసికొని తలయొకదారిఁ బయలుదేరిరి. అందుదత్తకుండు ఒకమార్గంబునంబడిపోవుచు దారితప్పి యొక యర్థరాత్రంబున యక్షశైలంబునకుఁబోయి తత్క్రీడా విశేషంబులఁ జూచిచూచి యతనిచే స్త్రీగాఁ శపింపబడియెరు. ధారానగరముజేరు వఱకు నాఁడుతనము రాకుండునట్టును సంవత్సరముగాఁగానే శాపాంత మగునట్లును నతనిచేవరంబు వడసి యప్పురంబునకుఁ బోవుచుండ రాజపుత్రికయెక్కుగుఱ్ఱము కళ్ళెముత్రెంచుకొని పారిపోయి యాదత్తు నెక్కించుకొని యుద్యానవనములోఁ బ్రవేశించినది. అంతలోనతం డాఁడుదియయ్యెను. మొదటఁజూచినవారలతని బురుషుఁడనియుఁ దరువాత జూచినవారు స్త్రీయనియు వాదించిరి. దత్తుండు స్త్రీపురుష రూపములతో నావీట గావించినచర్యలు కడునాశ్చర్యకరములుగా నుండును. భోజురాజకాళిదాస వియోగసంయోగకథలును గోణికాపు