పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

చ. ఇరువురు రాజులైరి మఱియిద్దరురాజుల కల్లురైరి యొ
    క్కరుఁడల రాజమిత్రుఁడనగాఁదగె నొక్కఁడు యక్షకన్యకం
    బరిణయమయ్యె శ్రోత్రియుకుమారిత నొక్కఁడు బెండ్లియాడె నీ
    ధరఁదగుసప్తమిత్ర చరితంబు విచిత్రకథాస్పదంబుగన్ .

ఆర్యులారా ! ఈభాగమునకుఁ 'గథానాయకులైన దత్తక చారాయణ గోనదీన్‌య కుచుమార ఘోటకముఖ సువర్ణనాభ గోణికాపుత్రు లేడ్వరును లోక ప్రసిద్ధులగు కామశాస్త్రప్రవక్తలు పాంచాలుఁడు రచించిన కామశాస్త్రమును క్లుప్తపఱచి యేడ్వురునుబంచుకొని తలయొక యధికరణమును వ్రాసిరి. వీరు మహాపండితులైనట్లు వీరురచించినగ్రంథములే చాటుచున్నవి. వాత్స్యాయన సూత్రవ్యాఖ్యానకర్త దత్తకునిగుఱించి యిట్లువ్రాసెను.

గద్య మాధురో బాహ్మణః పాటలీపుత్రే వసతిం చకార. తస్యోత్తరె వయసి పుత్రోజాతః తస్యజాతమాత్రస్యమాతా మృతా. పితాపి, తత్రాన్యస్యై బ్రాహ్మణ్యై తం పుత్రత్వెన దత్వా కాలేన లోకాంతరంగతః బ్రాహ్మణ్యపి మమాయం దత్తకఃపుత్ర ఇత్యనుగతార్థ మేవ నామచక్రె స తయాసం వర్థితః కాశీంగత్వా అచిరేణైవ కాలేన సర్వావిద్యా: కలాశ్చ అధీతవాన్. వ్యాఖ్యానశీలత్వాద్దత్తకాచార్య ఇతి ప్రతీతిముపాగతః ఎకదాచ తస్యచేత స్యేవ మభవత్. లోకయాత్రా పరాజ్ఞేయాస్తి సాప్రాయశో వేశ్యాసుస్థితేతి. తతో వేశ్యాజనం పరిచయపూర్వకం ప్రత్యహముసాగమ్య తథాతామభివివేద. తతోసౌవీరసేనాప్రముఖ గణికాజనే నాభిహితః అస్మాకంపురుషరంజసముపదిశ్యతామితి. తన్నియోగా ద్వైసికంపృధక్చకారేతి అపిచయక్షేణశప్తొ దత్తకః స్త్రీబభూన పునశ్చకాలేన లబ్ధవరః పురుపోభూత్ తేనో భయరసజ్ఞేన దత్తెన పృధక్కృతమితి.

దత్తకునిజన్మభూమి పాటలీపుత్రనగరము తండ్రిమాధురుఁడు చిన్నతనమునందె తల్లిమృతినొందగాఁ దండ్రివానిని మఱియొక కాంతకు బెంచుకొననిచ్చెను. దానంజేసి యతనికి దత్తకుఁడను పేరువచ్చినది.