పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రతినూపురకథ.

71

పతిగాఁ బరిగ్రహించి ధనమార్జించునది గణిక యనంబడును. రూపమన గృహవస్తుప్రాగల్భ్యము. సౌందర్యము సామాన్యమైనను వస్తుపాగల్భ్యముగలది రూపాజీవయనంబడును. రాజస్త్రీలకడ సంచరించు దాదులు కుంభదాసులనంబడుదురు. నట శిల్పికారులభార్యలు భర్తృ మరణానంతరము వేశ్యావృత్తి వహింతురు. వారిని శిల్పికారిక లని పిల్చుచుందురు. వీరిలో గణికయే యుత్తమురాలు.

మఱియు నాత్మస్తుతిపరుని త్యాగశీలు గురుశాసనాతిక్రమణు స్వతంత్రు ధనికుఁ బ్రచ్ఛన్నకామునిఁ బతిగాఁ బరిగ్రహింపవలయు. కాంతుననుసరించి కృత్రిమరాగము స్వాభావికరాగమువలెఁ బ్రకటింపవలయును. కామపరులగు పురుషులు వేశ్యల కపటములు నమ్ముదురు. నాయకునిచేఁ బార్థింపబడియు తొందరపడి యంగీకరింపకూడదు. నాయకుని శీలము రాగముసక్తత దాతృత్వము లోనగు గుణంబులు బరీక్షించి యంగీకరింపవలయు. వానిరంజింపఁ జేయుటకు ననేకోపాయంబులుగలవు. వానిలోఁ గొన్నిటివివరించెద నాలింపుఁడు.

సీ. సందేశమాలించి జాగుజేసినవిటు
                 కడకు దానేపోయి యడుగవలయు
    నలరఁ దాంబూలమాల్యాను లేపనము లిం
                టికివచ్చినట్టి నాయకునకీయ
    వలయు మండవ పరివర్తనంబులు సేయ
               దగు బ్రియుం డనుర క్తిఁదగులుకొనఁగ
    సాంప్రయోగికమును సాకూతముగను సూ
               చింపఁగాఁదగుగమ్యు చిత్తమరసి

గీ. ప్రీతిదాయకములగు వాగ్రీతులొప్పఁ
    బెలఁగి క్రీడల విటుని రంజింపవలయు
    సక్తగాకుండ దా నతిసక్తయైన
    యట్లునటియింపవలెఁ గపటాత్మవేశ్య.