పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

జేసినది. ఆతండు తలపంకించుచు జాగ్రత నీరంకులు నీబొంకులు నాకడఁ బనికిరావు ఈమాటు ఏపాటితప్పు జేసినదని నీహృదయము జెప్పినను నిన్నుగట్టిగా శిక్షింతుఁజుమా ? యని పలికి యొప్పించి మన్నించెను.

అది మొదలాముదిత తన హృదయమునకు వెఱచి యడకువగా మెలం గుచుండెను. భార్యకుబుద్ధి కుదిరినదని నిశ్చయించి గోమఠుఁడు మఱికొన్ని దినములఱిగినవెనుక భార్యను బుట్టినింటికిఁ దీసికొనిపోయెను సోమవర్మయు భార్యయు వారిని మిక్కిలి సంతోషముతో నాదరించిరి. తల్లియు సఖురాండ్రును రహస్యముగా జారతో భర్త నిన్నిష్టముగాఁ జూచుచున్నాడా? కాపురమనుకూలముగా నున్నదియా ? విశేషము లేమనియడిగిన విని యవ్వనిత తన రెండుచేతులతో హృదయమును జూపుచు అవ్వ? అని నోరుమూసికొని యిదియున్నది. మాటాడకుఁడు వారితోఁ జెప్పఁగలదు. అని సంజ్ఞ చేయుటయు నాసన్న వారికేమియుం దెలిసినదికాదు. అప్పుడు తల్లి మఱియు మఱియుం దర్కించి యడిగిన నోరు మొత్తుకొనుచుఁ జెవులో "నే నేమిజేసినను నాహృదయము నామగనికిఁ జెప్పఁగలదు.” మీ రేమియు నన్నడుగవలదు. నాకాపుర మనుకూలముగానే యున్నది. అనిచెప్పినది.

ఆమె యావార్త సోమవర్మ కెఱింగించుటయు నతఁడు గ్రహించి యల్లుఁడుచేసిన నియమమున గూఁతురు బుద్ధిగలిగి వర్తించు చున్నదని మెచ్చుకొని వారిం దమయింటనుంచుకొని కాపాడుచుండెను.

శ్లో॥ సకృదపికులటాభి ర్యోగినీభిక్షు కాభిః
     నటవిటఘటితాభి స్సంసృజేన్మౌలి కాభిః।
     రుచిరమిదమముష్మై పథ్యమేతన్న వేతి
     ప్రతిదినమపిభర్తు ర్భోజనేచ్ఛాంవిదద్యాతొ॥

జార భర్తబోధించినప్రకారము కులటలతో యోగినులతో