పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ర్యహృదయాంతరమునఁ జెవినిడి యామెడెందము తనతో నేదియో చెప్పుచున్న ట్లిట్లభినయించెను.

ఊ ఊ. తరువాత వర్తకులు నలుగురా? ఊ. సాయంకాలమున నీదారింబోవుచున్నారా? ఊ. మేడగోడయెక్కి కూర్చుండి వారినిబైకి రమ్మనిపిలిచినదా? ఊ. పిమ్మట అందఱు లోపలికివచ్చిరా? ఆనక చావడిగదిలోఁ గూర్చుండఁబెట్టినదా? ఊ. తృప్తిగా భోజనముపెట్టినదీ! తరువాత. వారిలో నొకని ముందుగాఁ బడకగదిలోనికిఁ దీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండబెట్టినదియా ఊ. తరువాత మొదటివికార వేషమువేసికొని వచ్చి స్నా నార్ధమై పెరటిలోనికిఁ బోయినదా? తిరుగావచ్చునప్పటికి కావర్తకులు మూటలువిడిచి పారిపోవుచుండిరా? ఆ. వెనుకకొంతదూరము పోయిరమ్మని పిలిచినదీ. ఊ. వాళ్ళురాలేదూ? అయ్యో! పాపము తరువాత వారినిమిత్తము చింతించుచుఁ దెల్లవార్లు నిద్రపోలేదూ ! మఱివారిమూట లేమిజేసినది! చిన్నగదియకటుపై దాచినదా? సరే? అని యామెహృదయము తనతో నాకథయంతయు జెప్పినట్లభినయించెను.

అప్పుడాజార వెల వెల పోవుచుండును. రండా ! నేనులేనప్పుడు నీవుగావించిన దుష్టచర్యలన్నియు నీ డెందము చెప్పినది. వింటివికదా? అట్లుచేసితివా? లేదా. నిజముచెప్పుము అనుటయుఁ గన్నీరుగార్చుచు రామ రామ. నే నేమియు నెఱుఁగనని బొంకిన్ది. చీ చీ. రంకులాడి ఇఁకనీబొంకులు నిలువవు. నిజముచెప్పెదవా? లేదా అనిపెనివైచిన త్రాటితోవీపుపై నాలుగుదెబ్బలు కొట్టెను. బాబో రక్షింపుము. రక్షింపుము అని మొఱవెట్టుచు యధార్ధముజెప్పి యీతప్పు మన్నింపుడు. ఇఁకెన్నడు చేయను. అని పాదంబులంబడి ప్రార్థించినది. అది మొదటితప్పుగా మన్నించి విడిచిపెట్టెను. యధాప్రకారమే వారు గ్రీడింపుచుండిరి. మఱినాలుగుదినము లఱిగినవెనుక ప్రొద్దునలేచి