పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

బూనక యుపవస్త్రమైన దాల్చక ముల్లెలువిడిచి తలుపులు దెరచుకొని యొకరికొకరు జెప్పక కాలికొలఁదిని బారిపోవఁ దొడంగిరి.

ఆముద్దియ యాసద్దువిని వికటవేషముతోనే పారిపోవువారి వెంటపడి యోహో! సుందరులారా! పారిపోయెద రేల? రండురండు మీనిమిత్త మంతయో యాసపడితిని. నాయభిలాష తీర్పకపోవచ్చునా? ఇప్పుడేమి వచ్చినది? అని కేకలుపెట్టుటయు వాండ్రు తిరిగిచూచి అమ్మయ్యో! దానివేషము భయంకరముగానే యున్నది మనలఁ దరుముకొని వచ్చుచున్నది. చంపునేమోకదా? అని తలంచి ముల్లనక చెట్టనక గుట్టనక శక్తికొలఁది పారిపోవఁదొడంగిరి.

జారయుఁ గొంతదూరముపోయి పిలిచి నిరాశజెంది వెనుకకు మరలి తలుపులన్నియువైచి శయ్యపైఁ బండుకొని దుఃఖించుచు నెట్ట కే తెల్లవార్చినది. వర్తకులు తెల్లవారువఱకు పరుగిడి పరుగిడి సూర్యోదయమున కొకపల్లెజేరి వెనుకకుఁ దిరిగిచూచి అమ్మయ్యా! ఇప్పటికి బ్రతికితిమని తలంచుచు, నంతలో మూటలమాట జ్ఞాపకమువచ్చుటచే నయ్యో ! అయ్యో! నాలుగులక్షల వెలగల రత్నముల మూటలుపోయినవే! దరిద్రులమైపోతిమి. ఇళ్ళకు బోయి యేమిచేయుదుము? భార్యా పుత్రుల నెట్లు రక్షించుకొందుమని యందున్న చెరువుగట్టునగూర్చుండి దుఃఖించుచుండిరి.

అప్పుడు సూర్యోదయమైనది. గోమఠుండు సామగ్రింగొని యింటికిఁబోవుచుఁ దటాకతీరమున నుపవస్త్రములులేక కట్టుగుడ్డలతో గూర్చుండి విచారించుచున్న వర్తకులంజూచి శంకించుకొనుచు దాపునకుఁబోయి మీరెవ్వరు? చింతించుచుంటి రేల? ఒక్కనికిం బైగుడ్డలు లేవేమి? అని యడిగిన వారిలోనొకఁడు జరగినకథ యంతయుఁ జెప్పి రత్న పేటికలు పోయినవని యేడువఁ దొడంగెను. అప్పుడతండు గోణికాపుత్రుఁడుచెప్పిన యపాయము సఫలమైన