పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నవర్తకులకథ.

61

తీయింపుమని కేకలుపెట్టెను. అప్పుడాబోఁటి వేగవచ్చి కవాటములు తెరచినది. పడుచువారల నలువురంజూచి తలయూచుచులోపలకుఁ దీసికొనిపోయి యొకగదిలోఁబ్రవేశింపఁజేసినది. తృటిలో వంటజేసి వారికి భోజనముపెట్టినది. భోజనానంతరము వారిదాపున నిలువంబడి తాంబూలము నములుచు తెరువరులారా ! మీరెవ్వరు ? ఎందుఁబోవుచున్నారు? ఈపడుచుతనములో మీభార్యలను విడిచి తిరుగుట ధర్మమా? మీవిరహమున వారెంత వగచుచున్నారో ! నాభర్త నేఁటి యుదయముననే యూరికిఁబోయెను. ప్రొద్దునరాఁగలరు. ఒక్కనాటికే నాకెంతయో దుర్భరముగా నున్నది. ఒంటిగా బరుండుటవాడుకలేదు. మీలో నెవ్వఁడో యొకఁడు ధైర్యశాలి నాపడకటింట సహాయముగా నుండగలఁడా? యని యడిగినఁ గులుకుచు నావర్తకులు మేనుల సాత్వికవికారంబులు పొడమాప స్మరానుతాపముతో జవ్వనీ! నీవెవ్వతెవు? నీభర్త యెందుఁబోయెను? ఒంటిగా మీరిందుండనేల నీవృత్తాంత మెఱింగింపుము. ఒక్కఁడుగాదు. నలుగురమువచ్చి నీప్రక్కం బండుకొనియెదమని పలికిన విని యాకలికి యిట్లనియె.

ఇది నాపూర్వపుణ్యము. నలువురం జూచుభాగ్యము నాకు లేదు. తలిదండ్రుల కెడమైతిని నేనిందు వచ్చినతరువాతఁ బరపురుషులఁ జూచియెఱుంగను. నాపుణ్యమువలన నాపతి యూరికేగుటయు మీరు వచ్చుటయుఁ దటస్థించినది. నా వృత్తాంతము చాలగలదు. పిమ్మటఁ జెప్పెదంగాక. నిద్రమానుకొని మీనలుగురు నొకసారి రావలదు. జామున కొకఁడు రండు. ఎవ్వనికి గష్టముండదు. అందఱకు సుఖంబగు నని సూచించినది.

వారిలో వయసుకాఁడు తటాలునలేచి నేను ముందువచ్చెద. బడకగది చూపుమని చొరవగాఁబలికిన నవ్వుచు నాజవ్వని వానిఁ దన పడకటింటిలోనికిఁ దీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండఁబెట్టి క్షణ