పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నవర్తకులకథ.

59

    మండెడుకుంపటి మస్తకంబునదాల్చి
                  యొకచేత బెత్త మింకొకకరమున
    వేపకొమ్మధరించి వికటాస్యమొప్పంగ
                  హుంకార మొనరించు చుగ్రఫణితి
    కరతు మ్రింగుదు నిలుకదలకుమని పల్కు
                  చును నాధుశయ్య దాపునకుఁ బోయి

గీ. మూడుసారులు వలగొనిమూఢ ! యిందు
    బండుకొనియుండు నీపని పట్టుదాన
    మఱలఁజనుదెంచి యని యంత పెఱటిఁ కేగి
    తెరపి నా వేషమంతయుఁ దీసివైచి.

వేడినీళ్ళ జలకమాడి నూత్నభూషాంబరంబులు ధరించి వచ్చి నన్నుఁ గలసికొనవలయు. ఇదియే ప్రతిదినము గావింపఁదగు క్రీడాముఖాంగమని యెఱిఁగించి దగ్గిరయుండియట్లు కావింపఁజేసి యాచేడియతో గ్రీడింపుచుండెను. లోకజ్ఞానమేమియు నెఱుంగనిదగుట నమ్మగువ యదియ యాచారమని నమ్మియట్లు కావించుచుండెను. మఱికొన్ని దినంబులు గతించినవి.

-♦ రత్నవర్తకులకథ. ♦-

ఒకనాఁడు గోమఠుండు గృహసంబారమ్ములఁ దెచ్చుటకైప్రాంతమందలి గ్రామంబునకరుగుచు భార్యతో నోసీ! నేనూరికిఁ బోయి రాత్రికేవచ్చెదను. తప్పె నేని ప్రొద్దునవత్తు తలుపులువైచికొని భద్రముగానుండుమని పలికి యతండరిగెను. అది మొద లాముదిత విరహతురయై జన్మలగ్నఫలంబునంజేసి పరపురుషసంగమాభిలాష హృదయంబున దీపింపఁ జక్కగా నలంకరించుకొని యాహా ! నేఁడీరాత్రిలోపల నెవ్వఁడేని పురుషుఁడిక్కడకు రాఁగూడదా. అయ్యో! నాకీనిర్బంధవాసమేమిటికి. మాయూరిలోనుండిన స్వేచ్ఛగా సంచరింతునుగదా.