పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార కథ.

57

సోమవర్మ యూరిలో నెవ్వరిం బిలువక బంధువులరప్పింపక మఱునాఁడు గుడిలో గోమఠునకు జారనిచ్చి వివాహము గావించెను. అప్పటికి వారిప్రాణములు గూటంబడినవి. అప్పుడు గోమఠునికిఁ గల యానంద ఈపాటిదని చెప్పుటకు శేషునకు శక్యముగాదు. వివాహ మైన నాలుగుదినముల కొకనాఁడు సోమవర్మ గోణికాపుత్రునితోఁ బుత్రికావృత్తాంత మెఱిగించుటయు నతఁడు నవ్వుచు నిట్లనియె.

అయ్యా! మీరు వైదికోత్తములు. లోకవ్యవహారములంతగాఁ దెలిసినవారుకారని తోచుచున్నది. మీ రహస్యములన్నియు మేము వింటిమి. వినియే చేసికొంటిమి వినుండు.

శ్లో॥ భృశమనురాగః పత్యావపత్యవాత్సల్య మతివయస్త్వంచ।
     వ్యతికరనిర్వేదిత్వం ధర్మాపేక్షానకస్యాశ్చిత్॥

పతియం దనురాగము సంతానప్రీతి, వయసుమీరుట దుఃఖప్రాబల్యము, ఈమొదలగు కారణములచే స్త్రీ వ్యభిచరించదు. కాని, కేవలము ధర్మాపేక్షచేతగాదు. అని కొక్కోకుండే చెప్పియున్నాఁడు. మీరు నోటివట్టముచే నీముప్పు తెచ్చిపెట్టుకొంటిరి. పోనిండు మీయల్లుఁడు గట్టివాఁడు. భార్యం గాపాడుకొనఁగలడు. అని యుపన్యసించిన విని సోమవర్మ యతనిం గౌఁగిలించుకొని యప్పుడు తనమదిఁగల దుఃఖముపోయినదని స్తోత్రము గావించెను.

గోణికాపుత్రుండు గొన్నిదినములుమాత్ర మందుండి భార్యను గాపాడుకొనువిధానము గోమఠునకు బోధించి తదామంత్రణంబువడసి ధారానగరాభిముఖుండై యరిగెను. గోమఠుండత్త వారింట రాజోప భోగము లనుభవించుచు సుఖంబుండెను. జారయును,

సీ. వీధిబోవుచు వింతవిటుఁ డెవ్వఁడేని ది
                     య్యనిపాటబాడఁ దా నాలకించు
    సొగసైన పొరుగింటిమగవాని గోడసం