పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార కథ.

55

పీటలపై మడిపుట్టములిచ్చి కూర్చుండఁబెట్టెను. అతనిభార్య పీతాంబర ధారిణియై యలంకరించుకొని మంచిపదార్ధములుజేసివడ్డించినది. వారు తృప్తిగాభుజించిరి భోజనానంతరము తాంబూలములు వైచికొనుచు గోణికాపుత్రుడు సోమవర్మతో నార్యా ! మీకుఁ బిల్లలెందరని కుశలప్రశ్న చేసెను. అప్పుడు సోమవర్మ పట్టీ ! యిటురాయని కేక పెట్టెను. దివ్యాలంకారభూషితయై యా బాలికవచ్చి తండ్రిమ్రోల నిలువంబడినది. తద్రూపలావణ్యాది విశేషంబులుచూచి గోమఠుండు “మోహావేశముతో నీచిన్నది మిక్కిలి చక్కనిది. స్థితిగలది. నగలేమియును పెట్టనక్కరలేదు. గోణికాపుత్రుఁడు తానే పెండ్లియాడఁడు గదా ! అయ్యో ! నన్నేవలదని తానెట్లు స్వీకరించును. ఏమో! నన్ను మోసపెట్టుట కట్లనెనేమో ! ఆహా ! ఇది జారిణియైన నగుఁగాక ! యొక్క రేయి దీనితోఁగూడినం జాలదా నాకంతయోగము పట్టునా? అని పలువిధములఁ దలపోయుచుండెను.”

అప్పుడు సోమవర్మ కూఁతునొడిలోఁ గూర్చుండబెట్టుకొని అయ్యా! యిదియొక్కరితయే నాకుఁగూతురు. లేకలేక కలిగినది. ఇదియే పెండ్లికూఁతురు. అని పలికిన విని గోణికాపుత్రుఁడు బాలా ! నీపేరేమి? చదివితివా ? అని యడిగెను. సిగ్గుచే నాకన్నె యేమియు సమాధానము చెప్పినదికాదు. పిమ్మట నతండు మీపుత్రికకు జాతకమున్నదా? అని యడుగుటయు బ్రక్కనుండి భార్య వలదు వలదు అని సంజ్ఞచేయుచుండ వినిపించుకొనక సోమవర్మ మందస్వరముతో నున్నదని చెప్పెను. ఏదీ చూతము తెప్పింపుఁడని యడిగిన నతండు లేచి లోపలికిఁబోయి జాతకముతీయుచుండ భార్య యడ్డమువచ్చి మగనిందిట్టి మీ మూలమున నా బిడ్డకికఁ బెండ్లి కానేరదు. జాతకము లేదని చెప్పరాదా? అప్పుడే యీ యూరిలో నెవ్వరో యీ మాట వారి చెవిఁ బడవేసియుందురు. కానిచో దొలుతనే జాతక మడుగనేల?