పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    యేటిలోఁబడి చచ్చుటయే సుఖంబు
    గోమఠా ! గేస్తునకుఁ బ్రతికూలమగుట.

అని చెప్పినవిని గోమఠుండు మహాత్మా! మగవాఁడుసమర్ధుఁడై పరికింపుచుండ నాఁడుదియెట్లు వ్యభిచరింపఁగలదు.

క. భూవిబుధవతంసమ ! చెడు
    త్రోవల బోకుండ మదవతుల నెప్పటికిం
    గావఁగ రాదో పతులకు
    నీవనెదవొ యెల్లవారనిరొ యిబ్భంగిన్ .

క. మిన్నులపైఁ బోవదుగద
   యిన్నేలనెకద మృగాక్షి యెటకేగిన నా
   సన్నయెఱిఁగి వల్లభుఁడా
   సన్నస్థితిగదలనీక సకిఁగావఁడొకో.

అనుటయు గోణికాపుత్రుఁడు నవ్వుచుఁ గానిమ్ము. ఇప్పు డింత యేల? ముందు విచారించుకొందమని పలికి తిన్నగా సోమవర్మగారింటికింబోయి. సోమవర్మభార్య వారింజూచి బ్రహ్మచారులని తెలిసికొని పడుచు నడుగవచ్చిరని నిశ్చయించి పుత్రిక నలంకరింపఁ బరిచారికల నియమించినది. వారికిఁ బాదములు గడిగికొనరజతకలశముతో నుదకములు తానే తీసికొనిపోయి యిచ్చినది. కాళ్ళుగడిగికొని గోణికాపుత్రుండు సోమవర్మగా రూరనున్నారా ? అనియడుగుటయు నామె యూరనున్నారు. స్నానార్ధమై తటాటకమున కరిగిరి. ఇప్పుడే వత్తురు. పెరటిలో నుష్ణోదక మున్నది. స్నానము చేయుఁడు అనిబలవంతముగా వారి నుష్ణోదక స్నానము జేయించినది. ఇంతలో సోమవర్మ యింటికి వచ్చెను. భార్య వారిరాక పతి కెఱిఁగించినది.

సోమవర్మ వారితో నార్యులారా ! మీ రాకచే మేము కృతార్ధులమైతిమి. మాయిల్లు పవిత్రమైనదని స్తుతియించుచుఁ బైడిపువ్వుల