పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

45

40 మణిరాగాకరజ్ఞానం॥ స్పటికాదిమణులకు రంగులు గలుగఁజేయు విధం బెరుంగుట. పద్మరాగాదిమణులు పుట్టుచోటు దెలియుట,

41 వృక్షాయుర్వేదయోగాః॥ వృక్షలతాదుల దోహదముల నెఱుంగుట.

42 మేషకుక్కుటలావక యుద్ధవిధిః॥| సజీవ ద్యూతాదివిభుల నెఱుంగుట.

43 శుకశారికాప్రలాపనం॥ శుకశారికాదిపక్షులకు మాటలు నేర్చుట. సందేశములు పంపుట లోనగు విషయంబు లెరుంగుట.

44 ఉత్సాదనే సంవాహనే కేశమర్దనే చ కౌశలం॥ తలయంటుటయు, గాళ్ళు పట్టుట లోనగుపనుల యందు నేర్పు. ఇది పరుల నారాధించునిమిత్తము.

45 అక్షరముష్టికాకధనం॥ గూఢాక్షరములతో శ్లోకములు రచించుట. దీనికే యక్షరముద్రయని పేరు.

46 మ్లేచ్ఛితవికల్పాః॥ సాధుశబ్దములతో గూడినదైనను నక్షర వ్యత్యాసంబున నస్పష్టార్ధంబగు పదంబులు మ్లేచ్ఛితకములని చెప్పంబడును. అట్టిశబ్దములతో శ్లోకములు రచించుట.

47 దేశభాషాలిపిజ్ఞానము॥ సకలదేశభాహి లిపివిశేషములం దెలిసికొనుట.

48 పుష్పశకటివా॥ పూవులునిమిత్తముగాఁ జేసికొను శకటిక రచించుట.

49 నిమిత్తజ్ఞానం॥ శుభాశుభశకున మెఱుంగుట.

50 యంత్రమాతృకా॥ విశ్వకర్మ ప్రోక్తములైన సజీవ నిర్జీవ యంత్రములు చేయువిధానము నేర్చుట. బండ్లు నోడలు మొదలగునవి యంత్రములతో జేయుట.

51 ధారణమాతృకా॥ ఏకసంధగ్రాహిత్వము. ఒకసారి వినిన దానిని జదువుట.